Asianet News TeluguAsianet News Telugu

#Salaar ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్,షాక్ లో ఫ్యాన్స్

ప్రభాస్ హీరోగా  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. ఈ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఆడియన్స్ అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. 

Is #Salaar AP distributors bring a bit of shock to Prabhas fans jsp
Author
First Published Nov 16, 2023, 10:35 AM IST

 ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్ర‌భాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా సలార్ (Salaar) పై ఏ రేంజి హైప్ ఉందో తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడగా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తారని ప్రకటించింది చిత్రయూనిట్.  సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ టీజర్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.ఈ నేపధ్యంలో ‘సలార్’ రిలీజ్ కు ఇంకా ఐదు వారాల సమయం మాత్రమే ఉంది. ఇటీవలే ఈ చిత్రంలోని ఐటెం సాంగ్  షూట్ తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది.  ప్రమోషన్స్ లో జోరు పెంచడానికి ప్లాన్ రెడీ చేస్తోంది టీమ్. డిసెంబర్ 1న ‘సలార్’ ట్రైలర్ ను గ్రాండ్ లెవెల్ లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
ఇదిలా ఉంటే  ‘సలార్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజులో జరుగుతుంది. సౌత్ లో ‘సలార్’ చిత్రాన్ని విడుదల చేయబోతున్న డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ను ఒక్కొక్కటిగా అనౌన్స్ చేస్తుంది చిత్రటీమ్ . కన్నడలో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్  సొంత రిలీజ్ చేస్తుండగా.. కేరళలో పృథ్వీరాజ్ కి సంబంధించిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ కి సంబంధించిన రెడ్ జయంట్ మూవీస్ భారీ స్థాయిలో ‘సలార్’ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. లేటెస్ట్ గా ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ వచ్చింది.
 
 ఉత్తరాంధ్రలో ఈ చిత్రాన్ని సిరి సాయి సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే.. తూర్పు గోదావరి – లక్ష్మీ నరసింహ శ్రీ మణికంఠ ఫిల్మ్స్, పశ్చిమ గోదావరి – గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, కృష్ణ, గుంటూరు – కె.ఎస్.ఎన్. టెలీ ఫిల్మ్స్, నెల్లూరు – శ్రీ వెంగమాంబ సినిమాస్, సీడెడ్ శిల్పకళా ఎంటర్ టైన్ మెంట్స్ ‘సలార్’ రైట్స్ దక్కించుకున్నాయి. మరోవైపు తెలంగాణకు సంబంధించిన ‘సలార్’ డిస్ట్రిబ్యూటర్స్ గురించి ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

 ఈ సినిమాని పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ శాతం ఎస్టాబ్లిష్ కానివారే కావటం విశేషం. సాధారణంగా పెద్ద సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేవారు పంపిణీరంగంలో నెంబర్ వన్ స్టేజిలో ఉన్నవారు ఉంటారు. సలార్ అతి  పెద్ద ప్రాజెక్టు కావటంతో ఆ స్దాయి డిస్ట్రిబ్యూటర్స్ నే ఎక్సపెక్ట్ చేస్తారు. కానీ రేట్లు ఎక్కువ చెప్పటంతో పెద్ద వాళ్లు ఎవరు సీన్ లోకి రాలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఓకే అయ్యిన  డిస్ట్రిబ్యూటర్స్ ఏ మేరకు థియేటర్స్ ని ప్లా్ చేస్తారో రిలీజ్ అనేది ఫ్యాన్స్ కు వర్రీగా మారింది. ప్రభాస్ కెరీర్ కు క్రూసియల్ అని చెప్పాలి. సలార్..ప్రభాస్ అభిమానులు కమబ్యాక్ ఫిల్మ్ గా భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios