Asianet News TeluguAsianet News Telugu

రవితేజ సినిమా చూసి మాట్లాడు.. హరీష్ శంకర్ మరో సెన్సేషనల్ ట్వీట్!

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు హరీష్ శంకర్.  ఆయన చేసే కామెంట్స్ ఒక్కోసారి సంచలనం రేపుతుంటాయి. మరోసారి హరీష్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అది వైరల్ అవుతుంది.  
 

is raviteja mister bachchan as well a remake this is director harish shankar answer ksr
Author
First Published Jul 21, 2024, 6:51 PM IST | Last Updated Jul 21, 2024, 6:51 PM IST

దాదాపు 18 ఏళ్ల కెరీర్లో హరీష్ శంకర్ చేసింది ఏడు సినిమాలు. దర్శకుడిగా హరీష్ శంకర్ డెబ్యూ మూవీ షాక్ 2006లో విడుదలైంది. రవితేజ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మరో ఆఫర్ రావడానికి ఐదేళ్ల సమయం పట్టింది. రవితేజ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. 2011లో విడుదలైన మిరపకాయ్ సూపర్ హిట్. గబ్బర్ సింగ్ మూవీతో హరీష్ శంకర్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. 

ఎన్టీఆర్ తో చేసిన రామయ్యా వస్తావయ్యా... నిరాశపరిచింది. సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథమ్ పర్లేదు అనిపించుకున్నాయి. గద్దలకొండ గణేష్ హిట్ టాక్ తెచ్చుకుంది. గద్దల కొండ గణేష్ 2019లో విడుదల కాగా ఐదేళ్లు దాటిపోయినా ఆయన నుండి మరో చిత్రం రాలేదు. పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూడటంతోనే పుణ్యకాలం కాస్తా గడచిపోయింది. భవదీయుడు భగత్ సింగ్ కాస్తా ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యింది. 

పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ మధ్యలో ఆగిపోయింది. లాభం లేదని రవితేజతో మిస్టర్ బచ్చన్ మొదలుపెట్టాడు. ఈ మూవీ షూటింగ్ వాయువేగంతో పూర్తి చేశాడు. ఆగస్టు 15న విడుదల అంటున్నారు. కాగా హరీష్ శంకర్ తెరకెక్కించిన 7 సినిమాల్లో రెండు రీమేక్స్ ఉన్నాయి. గబ్బర్ సింగ్ హిందీ దబంగ్ రీమేక్ కాగా, తమిళ క్లాసిక్ జిగర్తాండ రీమేక్ గా గద్దలకొండ గణేష్ తెరకెక్కింది. 

అలాగే పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ హీరో విజయ్ హిట్ మూవీ తేరి రీమేక్ అనే వాదన ఉంది. ఈ క్రమంలో మిస్టర్ బచ్చన్ కూడా రీమేక్ అని భావించిన ఓ నెటిజన్... సర్, మీరు రీమేక్స్ చేయడం ఆపేయండి. మీరు సొంతగా రాసుకున్న కథలతో అద్భుతం చేయగలరు. భారీ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వండి. మిస్టర్ బచ్చన్ కి గుడ్ లక్, అంటూ హరీష్ కి సలహా ఇచ్చాడు. 

మిస్టర్ బచ్చన్ చూసి నువ్వు రీమేక్ అనుకుంటే అప్పుడు మాట్లాడుకుందాం బ్రో... నేను సోషల్ మీడియా ఫ్రెండ్లి డైరెక్టర్ ని. మీరు ఎప్పుడైనా నాకు మెసేజ్ పెట్టవచ్చు. అని హరీష్ శంకర్ సదరు నెటిజన్ కి సమాధానం ఇచ్చాడు. పరోక్షంగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ రీమేక్ కాదని హింట్ ఇచ్చాడు. మరోవైపు రవితేజ వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్నారు. మిస్టర్ బచ్చన్ ఆయనకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. 13 ఏళ్ల తర్వాత హరీష్-రవితేజ కాంబోలో మిస్టర్ బచ్చన్ వస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios