వర్మ, నాగార్జున మూవీ టైటిల్ ఖరారైందా..

First Published 5, Dec 2017, 9:39 AM IST
is ramgopalvarma nagarjuna movie title confirmed
Highlights
  • శివ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నాగార్జున, వర్మ
  • తాజాగా 28 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో మరో చిత్రం
  • నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా టైటిల్ ఖరారు?

తెలుగులో వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన శివ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా రామ్‌గోపాల్‌ వర్మ, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్నది. ఇటీవల వర్మ ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన ఫస్ట్‌లుక్‌లను షేర్‌ చేశారు. వర్మ సినిమాలంటే.. ఎక్కువగా తుపాకులు, వివాదాల నేపథ్యంలో ఉంటాయన్న విషయం తెలిసిందే.

 

ఇప్పుడు తీయబోయే చిత్రంలో నాగ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కన్పించనున్నారు. కాబట్టి ఈ సినిమాకి గన్‌, సిస్టమ్‌ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారట. అయితే టైటిల్‌ తెలుగులో ఉండబోతోందా లేక ఆంగ్లంలో ఉండబోతోందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

 

నవంబర్‌ 20న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రం ప్రారంభించారు. ఇప్పటివరకు నాగ్‌ చేయని తరహాలో ఈ చిత్రం ఉండబోతోందని వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. తాను కూడా ఇలాంటి చిత్రం ముందెన్నడూ చేయలేదన్నారు వర్మ. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా మైరా సరీన్‌ నటిస్తోంది. చాలా త్వరగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకుని, అఖిల్ హలో మూవీ ప్రమోషన్స్ తర్వాత తిరిగి షూటింగ్ నిర్వహిస్తామని నాగార్జున తెలిపారు.

loader