2019 లో జరగనున్న ఎలక్షన్స్ పై ఇప్పటినుండే హీట్ పెరిగిపోతుంది. రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్స్ కోసం సిద్ధమవుతున్నాయి. ఈసారి ప్రచారం కోసం  సినిమా సెలబ్రిటీలను రంగంలోకి దింపుతున్నారు. తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారం కోసం వాడుకోవాలని నిర్ణయించుకుంది. 

తన బాబాయ్, చంద్రబాబునాయుడు అడిగితే ఎన్టీఆర్ కూడా కాదనలేడు. మరోపక్క జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్.. మెగాఫ్యామిలీని రంగంలోకి  దింపుతున్నారని టాక్. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు 'జనసేన' పార్టీ కోసం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారట.

కొణిదల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ జనసేన తరఫున ప్రచారం చేసి కాపు వర్గపు ఓట్లన్నీ జనసేన పార్టీకి చేరేలా ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్ గా చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ మాట మీదే తుఫాను ఎఫెక్ట్ తో బాధపడుతున్న ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అలానే అల్లు అర్జున్ కూడా పాతిక లక్షల విరాళాన్ని ప్రకటించారు.

చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారట. ఇది ఇలా ఉండగా.. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తోన్న రానా దగ్గుబాటి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి వచ్చే ఏడాది ఎలెక్షన్స్ కి సినీ గ్లామర్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి!