యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి భారీ గ్యాప్ వచ్చింది. ఆయన నటించిన చివరి చిత్రం అరవింద సమేత వీరరాఘవ విడుదలై దాదాపు రెండేళ్లు అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ తో 2020 జులైలో దిగుతాడు అనుకుంటే, అసలు ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.  ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుండి కొమరం భీమ్ గా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేస్తారనుకుంటే అది కుదరలేదు. మొత్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో పూర్తి నిరాశలో ఉన్నారు. 

కాగా ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్ పూర్తి అయిన వెంటనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. నిజానికి ఏప్రిల్ లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సివుంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపయింది. ఇక పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్స్ మొదలుకావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. కాగా ఈ చిత్రం కొరకు ఎన్టీఆర్ తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ తిరిగి ఇచ్చేశారట. ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మాతలుగా ఉన్నారు. 

ఈ రెండు సంస్థలు ఎన్టీఆర్ కి దాదాపు 8కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారట. ఐతే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి చాల సమయం పట్టేలా ఉంది. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ కంటే ముందు ప్రశాంత్ నీల్ తో మూవీ చేసే ఆలోచనలో కూడా ఉన్నారట. అందుకే ఆయన తాను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారని టాలీవుడ్ టాక్. మరి ఈ విషయంలో స్పష్టత రావాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.