Asianet News TeluguAsianet News Telugu

‘నిశ్శ‌బ్దం’..అమేజాన్ ప్రైమ్ కు సేఫ్ ప్రాజెక్టేనా?

 కరోనా కారణంగా థియేటర్స్ లేకపోవడంతో.. అనేకానేక చర్చల అనంతరం ఈ చిత్రం  అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 2న విడుదలైంది. టీజ‌ర్, ట్రైలర్  ఆద్యంతం ఆస‌క్తి రేకెత్తించటంతో.. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త‌ స్వీటీని ప‌రిచ‌యం చూస్తామని ఆశపడ్డారు.  హార‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని చెప్పారు కానీ హారర్ పాళ్లు తక్కువే.

Is Nishabdham Safe Project at Box Office JSP
Author
Hyderabad, First Published Oct 17, 2020, 8:20 AM IST

 భాగ‌మ‌తి రిలీజ్ త‌ర్వాత అనుష్క పూర్తిగా బెంగుళూరుకే ప‌రిమితమైంది. ఆ త‌ర్వాత‌ ఏ ఈవెంట్ లోనూ అనుష్క క‌నిపించింది లేదు. దీంతో స్వీటీనీ ఎప్పుడెప్పుడు చూస్తామా? అని అభిమానులు వెయిట్ చేసారు.  ఆ సమ‌యం రానే వ‌చ్చేసింది. అనుష్క శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `నిశ్శ‌బ్దం` కొద్ది రోజుల క్రిత‌మే రిలీజ్ అయింది.  కరోనా కారణంగా థియేటర్స్ లేకపోవడంతో.. అనేకానేక చర్చల అనంతరం ఈ చిత్రం  అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 2న విడుదలైంది. టీజ‌ర్, ట్రైలర్  ఆద్యంతం ఆస‌క్తి రేకెత్తించటంతో.. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త‌ స్వీటీని ప‌రిచ‌యం చూస్తామని ఆశపడ్డారు.  హార‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని చెప్పారు కానీ హారర్ పాళ్లు తక్కువే.

 రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి.  అయితే ట్రేడ్ వర్గాల సమాచారం బట్టి ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం అందరికీ సేఫ్ ప్రాజెక్ట్‌లా నిలిచిందని అంటున్నారు.అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రానికి భారీ వ్యూస్ వచ్చినట్లుగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. నిర్మాత సైతం ఈ సినిమా ద్వారా బాగానే లాభ పడ్డారని సమాచారం. అయితే అనుష్క కన్నా అంజలికే సీన్స్ ఎక్కువ ఉండటం, మాధవన్ నెగిటివ్ క్యారక్టర్ అనుకున్న స్దాయిలో పండకపోవటం సినిమాపై విమర్శలు రావటానికి కారణమైంది.అయితే అనుష్క సినిమా అవ్వటం,  లాక్‌డౌన్‌లో స్టార్ హీరోలు నటించిన చిత్రమేది విడుదల కాకపోవడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. టెక్నికల్ గా ఈ చిత్రం రూపొందిన తీరుపై దర్శకుడు హేమంత్ మధుకర్ ప్రశంసలు వస్తున్నాయి. అంటే చూసిన వాళ్లు తప్ప అందరూ హ్యాపీనే అన్నమాట.  

 ఇందులో అనుష్క మాట‌లు కోల్పోయిన దివ్యాంగురాలిగా న‌టించింది. అమెరికా సీటెల్ లోని అంద‌మైన లోకేష‌న్లు, భ‌యాన‌క వాతావ‌రణంలో చిత్రీక‌రించారు. ఒక జంట సీటెల్ లో విహార యాత్ర‌కు వెళితే జ‌రిగిన సంఘ‌ట‌న‌ల స‌మాహారం గా సినిమా కథ నడుస్తుంది.  ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాధవన్, మైఖేల్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ వంటి వారు నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు.

Follow Us:
Download App:
  • android
  • ios