నాచురల్ స్టార్ నాని జెర్సీ హిట్ తో మళ్లీ సూపర్ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గా నాని జెర్సీ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించి హాట్ టాపిక్ గా నిలిచారు. జెర్శీ   తర్వాత విక్రం కుమార్ తో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నాడు నాని. ఆ సినిమా తర్వాత ఇంద్రంగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.

ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో వచ్చిన అష్టా చెమ్మ, జెంటిల్ మెన్ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. అయితే చిత్రంగా.. సోమవారం ఉదయం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నటీనటులు లిస్ట్ లో నాని పేరు లేకపోవడం అందిరకీ  ఆశ్చర్యం కలిగించింది. నాని పేరు మినహా మిగతా ముగ్గురి పేర్లనూ క్యాస్టింగ్ లిస్ట్‌లో ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. కావాలనే నాని పేరు సస్పెన్స్‌లో పెట్టడానికి అలా చేశారని కొందరంటూంటే...డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక నాని తప్పుకున్నాడని మరికొందరంటున్నారు. 

నానితో డేట్స్ ఖరారు అయ్యాక ఆ విషయం ప్రకటన ఇద్దామనీ టీమ్ ఆగిందని చెప్తున్నారు.  ఇక నాని వైపు నుంచి చూస్తే ఈ సినిమా చేస్తున్నట్లు ‘జెర్సీ’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాంటప్పుడు ఇప్పుడు హఠాత్తుగా ఈ పేరు మాయం అవటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. వారు ఇచ్చిన ప్రకటన ప్రకారం ..హీరో సుధీర్ బాబు ఈ సినిమా లో సోలో హీరో కాగా నివేతా థామస్ మరియు అదితి రావ్ హైదరి ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ సినిమాకి ‘వీ’ అనే అక్షరాన్ని టైటిల్ గా ఖరారు చేయడం జరిగింది.

ఇక దిల్ రాజు ఈ సినిమా కి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమా కి స్వరాలు సమకూర్చనున్నారు. ‘సైరా.. నరసింహారెడ్డి’ తర్వాత అతడు సంగీతం అందిస్తున్న తెలుగు సినిమా ఇదే. ఇంద్రగంటి సినిమాలకు రెగ్యులర్ గా పనిచేసే ఛాయాగ్రాహకుడు పి.జి. విందా ఈ సినిమాకీ పనిచేస్తుండగా రవివర్మ యాక్షన్ డైరెక్టర్‌గా, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.