#Pushpa2: చైతూ తండేల్ ... 'పుష్ప 2' కు బ్యాక్ అప్ ప్లానా?
పుష్ప 2 రిలీజ్ వాయిదా వార్తలతో మరికొందరు తెలుగు నిర్మాతలు అదే రోజున తమ సినిమా రిలీజ్ పెట్టుకోవాలని ప్లానింగ్ లో ఉన్నారు. అల్లు అరవింద్ సైతం తమ తండేలు చిత్రాన్ని ...
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాసం ఉందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు కొందరు అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. నిజానికి ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ లో పుష్ప 2 రిలీజ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. అయినా ఈ సినిమాలో కేశవ పాత్ర పోషించిన జగదీశ్ ప్రస్తుతం జైల్లో ఉండటంతో షూటింగ్ ఆలస్యమవుతోందని, అందుకే రిలీజ్ వాయిదా పడిందని ట్వీట్లు చేస్తుండటం గమనార్హం.
అలాగే ఈ సినిమా ఆగస్ట్ 15న అజయ్ దేవ్‌గన్ సింగం అగైన్ కూడా అదే రోజు రిలీజ్ కానుంది. కానీ వాయిదా వార్తల నేపథ్యంలో ఇప్పుడు సింగం అగైన్ ఒక్కటే ఆ రోజు రిలీజ్ కాబోతోందని బాలీవుడ్ మీడియాలో ట్రేడ్ వార్తలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ ఎంత పట్టుపట్టినా సుకుమార్ ఫెరఫెక్షన్ తో లేటు అవుతోందని, ఆయనకు ఇలా ప్రాజెక్టులు లేటు అయ్యే హిస్టరీ ఉందని చెప్తున్నారు. పుష్పపై అనేక కోట్ల రూపాయలు స్టేక్ ఉండటంతో ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడా కంగారుపెట్టే పరిస్దితి లేదు. క్వాలిటీ విషయంలో తగ్గేదేలే అంటున్నారట. అయితే ఆగస్ట్ 15 కు రిలీజ్ అవుతేనే ఫెరఫెక్ట్ రిలీజ్ ఉంటుందని మాత్రం చెప్తున్నారట. ఇక ఇవన్నీ ప్రక్కన పెడితే పుష్ప 2 రిలీజ్ వాయిదా వార్తలతో మరికొందరు తెలుగు నిర్మాతలు అదే రోజున తమ సినిమా రిలీజ్ పెట్టుకోవాలని ప్లానింగ్ లో ఉన్నారు. అల్లు అరవింద్ సైతం తమ తండేలు చిత్రాన్ని ...ఒకవేళ పుష్ప 2 వాయిదా పడితే ఆ రోజున రిలీజ్ కు దించాలని బ్యాక్ అప్ ప్లాన్ గా పెట్టుకున్నారని తెలుగు మీడియా అంటోంది.
అంటే ఆ లెక్క ప్రకారం పుష్ప 2 చిత్రం రిలీజ్ డిసెంబర్ కు వెళ్తే మాత్రం తండేలు ఆగస్ట్ 15 న వచ్చేస్తుందన్నమాట. పుష్ప హిట్ తర్వాత పుష్ప ది రూల్ ను మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.200 కోట్లకు డీల్ జరగబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకూ కేవలం ఆర్ఆర్ఆర్ మాత్రమే ఇంత భారీ మొత్తానికి అమ్ముడైంది. వాయిదా వార్తల నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్ హక్కుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలని బయర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.