సమంత 13 ఏళ్ల సినిమా ప్రస్థానం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సమంత ఫస్ట్ మూవీ ఏమాయ చేసావే విడుదలై 13 ఏళ్ళు అవుతుంది. నాగ చైతన్య హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. సిల్వర్ స్క్రీన్ మీద చైతూ-సామ్ ల కెమిస్ట్రీ అద్భుతం చేసింది. ఇక ఫస్ట్ సినిమా అయినప్పటికీ మెచ్యూరిటీ తో కూడిన యాక్టింగ్ తో సమంత మనసులు దోచేసింది. నిజంగానే ఆడియన్స్ ని తన మాయలో పడేసుకుంది. ఏమాయ చేసావే సూపర్ హిట్ కాగా... సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినిమా సినిమాకు పైకి ఎదుగుతూ టాప్ హీరోయిన్ అయ్యింది.
ఇన్నేళ్ల కెరీర్లో అనేక కమర్షియల్ చిత్రాలు చేశారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు. వెబ్ సిరీస్లతో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో కూడా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో తనను సప్పోర్ట్ చేసిన ప్రేక్షకులకు సమంత కృతజ్ఞతలు తెలిపారు. ఇంస్టాగ్రామ్ లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
'గడిచే ప్రతి రోజు వేసే ముందడుకు మీ పేమ, అభిమానం వలనే. ఈ ప్రేమ రోజూ నాకు మంచి చేస్తుంది. ఇక నన్ను తరచుగా ఇబ్బంది పెట్టే విషయాలు... ఇకపై ఏం చేయలేవు. కేవలం ప్రేమ కృతజ్ఞతా భావం ఉంటే చాలు... థాంక్యూ' అని ఇంస్టాగ్రామ్ కామెంట్ పెట్టారు. మీ ప్రేమాభిమానాలు తోడుంటే నన్ను బాధించే అంశాలు ఏమీ చేయలేవని సమంత అన్నారు. ఇక సమంతను తరచుగా వెంటాడే ఆ చెడ్డ విషయాలు ఏమిటని ఆసక్తి కలుగుతుంది.
మరో ఊహించని పరిణామం ఏమిటంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండే నాగ చైతన్య ఏమాయ చేసావే 13వ యానివర్సరీ మీద స్పందించడం. సమంతతో కూడిన రొమాంటిక్ పోస్టర్ ని కూడా షేర్ చేశారు. దీంతో సమంత మీద ఆయనకు ప్రేమ తగ్గలేదనే ప్రచారం జరుగుతుంది. విడాకులు తర్వాత ఫస్ట్ టైం సమంతకు సంబంధించిన ఒక విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏమాయ చేసావే నాగ చైతన్యకు రెండో చిత్రం, అలాగే ఫస్ట్ హిట్. అన్నింటికీ మించి తన మాజీ భార్య సమంతతో నటించిన చిత్రం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే నాగ చైతన్య గుర్తు చేసుకున్నారు.
సమంత మాత్రం కేవలం తన సినీ జర్నీని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు. ఇక అభిమానులను ఉద్దేశిస్తూ షేర్ చేసిన థాంక్ నోట్ లో బాధించే, ప్రభావితం చేసే విషయాలన్నారు. ఈ క్రమంలో సమంతను వెంటాడుతున్న ఆ విషయాలు ఏంటనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. విడాకుల డిప్రెషన్ ఆమెను ఇంకా వదల్లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. 2021 అక్టోబర్ లో సమంత-చైతూ విడాకుల ప్రకటన చేశారు. విడాకులు ప్రకటన అనంతరం సమంత మానసిక వేదన అనుభవించారు. అందులో నుండి బయటపడేందుకు సమంత ఏకంగా ఆధ్యాత్మిక బాటపట్టారు. ఏది ఏమైనా సమంతను చైతూ జ్ఞాపకాలు వదలడం లేదనిపిస్తుంది.
