సంక్రాంతికి విడుదల ఖరారు చేసుకున్న చిత్రాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి.  ఈ చిత్రాన్ని  హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. 


మహేష్‌బాబు హీరో గా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. రీసెంట్ గా హైదరాబాద్‌ షెడ్యూల్‌ లో యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించారు. భారీ సంఖ్యలో ఫైటర్స్‌ పాల్గొనగా హై ఇంటెన్సిటీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను తెరకెక్కించారు. సినిమాకు ఈ ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలుస్తుందని, మహేష్‌బాబు సరికొత్త యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తారని అంటున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది. 

సాధారణంగా ఏ పెద్ద సినిమా అయినా ఫారిన్ లొకేషన్ లేకుండా తియ్యరు. మహేష్ బాబు సినిమా లు అందుకు మినహాయింపు కాదు. ప్యూర్ లోకల్ లో స్టార్ సినిమాలు తీయటానికి ఇష్టపడరు. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఖచ్చితంగా ఫారిన్ లొకేషన్ ఉంటుంది. కానీ #GunturKaaram సినిమా అంతా ఇప్పటిదాకా లోకల్ లోనే తీశారు. పాట కోసం కేరళ వెళ్లకపోతే కనుక పూర్తిగా హైదరాబాదీ మేడ్ అవనుందని సమాచారం. ఈ విషయం నిజంగానే ఆసక్తికలిగించేది. గొప్పగా చెప్పుకునేది అవుతుంది. మన లోకల్ లొకేషన్స్ ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. 

ఇక సంక్రాంతికి విడుదల ఖరారు చేసుకున్న చిత్రాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నది భారీ అంచనాలున్న సినిమాల్లో ఇదొకటి. మహేశ్‌ - త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.