హాలీవుడ్ లో రాజమౌళి సినిమా! ప్లాన్ ఏంటంటే...
బాహుబలితో ప్యాన్ ఇండియా సినిమా చేసిన రాజమౌళి త్వరలో హాలీవుడ్ సినిమా చేయబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి.అయితే ఈ ఇంటర్నేషనల్ సినిమా ..హాలీవుడ్ టెక్నీషియన్స్ తో తీసే ఇండియన్ ఫిల్మ్ అవుతుందంటున్నారు. గతంలో బాలీవుడ్ దర్శకులు ఇలాంటి సినిమాలు చేసారు.
తెరపై నవరసాలను సమపాళ్లలో రంగరించి హిట్ కొట్టగల సమర్దుడైన డైరక్టర్ రాజమౌళి. తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాఫ్ కూడా చూడని దర్శకుడు. ఇప్పటికి ఆయన మొత్తం 12 సినిమాలు రూపొందించారు. అందులో సింహాద్రి, ఈగ, ఛత్రపతి, మగధీర, బాహుబలి వేటికవే స్పెషల్ గా నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించాయి. బాహుబలితో ప్యాన్ ఇండియా సినిమా చేసిన రాజమౌళి త్వరలో హాలీవుడ్ సినిమా చేయబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి.అయితే ఈ ఇంటర్నేషనల్ సినిమా ..హాలీవుడ్ టెక్నీషియన్స్ తో తీసే ఇండియన్ ఫిల్మ్ అవుతుందంటున్నారు. గతంలో బాలీవుడ్ దర్శకులు ఇలాంటి సినిమాలు చేసారు.
ఇప్పుడు రాజమౌళి కూడా ఇండియన్ కంటెంట్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో, హాలీవుడ్ ఆర్టిస్ట్ ల కలబోతతో సినిమా చేయబోతున్నారట. ఈ సినిమా నిమిత్తం ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్టోరీ లైన్ రెడీ చేసారంటున్నారు. రాజమౌళి ఆ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్ లోప్రవేసిస్తాడంటున్నారు. ఇండియన్ కమర్షియల్ సినిమా వాల్యూని హాలీవుడ్ కు రుచి చూపించబోతన్నారట. ఇలాంటి సినిమా కూడా తెరకెక్కించవచ్చా అనే స్దాయిలో యాక్షన్ ఎడ్వంచర్ గా సాగుతుందిట. మరి బ్యాక్ డ్రాప్ ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కావాలి. కానీ ప్రస్తుతం పరిస్థితుల కారణంగా వాయిదా పడచ్చు అంటున్నారు. ఈ సినిమా తరువాత రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ముందుగా మహేష్ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత తన హాలీవుడ్ సినిమాను మొదలుపెట్టే అవకాసం ఉంది.