సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే మూడు పెద్ద చిత్రాలు విడుదలవడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. కధానాయకుడు ఎన్టీఆర్, రజనీకాంత్ పేట, రామ్ చరణ్ వినయ విధేయ రామ రిలీజ్  కావడంతో అభిమానులు పోటీపడి మరీ బ్యానర్లు, కటౌట్లు కట్టారు. కటౌట్లకు పాలాభిషేకాలు, కొబ్బరి, గుమ్మడికాయలతో దిష్టి తీయడం, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం కనిపించింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లు రంగులమయంగా మారాయి. బాలకృష్ణ అభిమానులకు పోటీగా రామ్ చరణ్ అభిమానులు పలుచోట్ల బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయడం విశేషం.  

అయితే దురదృష్ణం ఏమిటంటే...ఏ సినిమాకు సరైన టాక్ రాలేదు. కథానాయకుడు ఓ డాక్యుమెంటరీ సినిమా గా ..ఓ వర్గాన్నే ఆకర్షిస్తోంది. ఇక పేట సినిమా మరీ భాషా సినిమాకు ఆర్డర్ వేసారని చప్పరించేసారు. ఇక వినయ విధేయ రామ సినిమాకు ఇప్పటికే దారుణమైన టాక్ స్ప్రెడ్ అయ్యిపోయింది. దాంతో అందరి దృష్ణీ ఇక సంక్రాంతి సీజన్ లో మిగిలిన వెంకటేష్, వరుణ్ తేజ ల చిత్రం ఎఫ్ 2 పై ఉంది. ఈ సినిమా ఏ మాత్రం పెద్ద హిట్ అయ్యే అవకాసం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీలు వెళ్లటానికి ఈ సంక్రాంతికి ఒక్క సినిమా కూడా సరైనది రాలేదు. దాంతో అందరి ఆశలు  ‘ఎఫ్ 2’పైనే ఉన్నాయి. 

విక్టరీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరోహీరోయిన్లుగా రూపొందిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెర‌కెక్కిన ఈ ఫ‌న్ రైడర్‌కు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకుడు.

'ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌’ వంటి హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్రమిది. మంచి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టు ఉన్న అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కించారు. 12న విడుదల అవుతోంది.