Asianet News TeluguAsianet News Telugu

‘పాడుతా తీయగా’ ఆపేస్తారా? లేక...: రామోజీరావు నిర్ణయం ఏమిటి?

ఈటీవిలో ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం 1996 మే 16న ప్రారంభమై.. నిర్వరామంగా ప్రసారమవుతూ.. భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షోగా సంగీత ప్రియులకు వినోదాన్ని పంచింది. 

Is ETV to shelve Padutha Theeyaga program jsp?
Author
Hyderabad, First Published Oct 17, 2020, 7:30 AM IST

తెలుగు చానెళ్లలో ప్రసారమయ్యే పాటల పోటీల్లో ‘పాడుతా తీయగా’ తర్వాత అంత ఫేమస్ అయిన షో మరొకటి లేదు. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం మానస పుత్రికగా ఎదిగిన ఈ పోగ్రాం తిరుగులేని టీఆర్పీతో నిరాటంకంగా సాగిపోతూండేది. ఇప్పుడు ఆయన ప్లేస్ ని రీ ప్లేస్ చేసేదెవరు. అంత టాలెంట్ ఉన్నదెవరికి అనేది పెద్ద సమస్యగా మారింది. ఓ ప్రక్కన పాడుతూ..మరో ప్రక్క పాడటానికి వచ్చిన వారి పాటలో లోపాలను సుతిమెత్తగా ఎత్తి చూపుతూ...ఆ పాట వెనక చరిత్రను చెప్తూ రియాలటీ షోను నడపటం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఎస్పీగారికి ఉన్నంత యాంకరింగ్ స్కిల్స్ వాళ్లను వెతికిపట్టుకోవాలి. దాంతో ఈ షో కంటిన్యూ అవుతుందా అనే సందేహం చాలా మందిలో మొదలైంది. 

రామోజీరావు గారూ ఇదే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.  ఎస్పీ బాలుతో అనుబంధం ఉన్న ఈ పోగ్రామ్ ని ఆపేయటమా లేక వేరే పేరుతో..ఫార్మెట్ మార్చి ఈ షో ను కంటిన్యూ చేయటమా అని టీమ్ అంతా చర్చిస్తూ,ప్రపోజల్స్ పెడుతున్నారట. అయితే మార్కెటింగ్ వాళ్లు, ఎడ్వర్టైజ్మెంట్ వారు..ఇలా హైయిస్ట్ టీఆర్పీ ఉన్న పోగ్రామ్ ని ఆపేయటం లేదా పేరు మార్చటానికి ఒప్పుకోరు అని కూడా అంటున్నారు. ఏదైమైనా బాలు అంటే పాడుతా తియగా.. పాడుతా తియగా అంటే బాలు అన్నట్లుగా ప్రేక్షకుల మనసుని దోచిన ఈ షో భవిష్యత్తు ఏమిటో  చూడాలి ఏం జరగనుందో.
 
ఇక సినిమాల్లో తగ్గించిన తర్వాత  ‘పాడుతా తియ్యగా’ అంటూ బుల్లితెరకు కూడా ఎంతో దగ్గరయ్యారు బాలు. వేల పాటలతో ఎందరో సంగీత ప్రియుల గుండెల్లో తనదైన ముద్ర వేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం.. బుల్లితెర ప్రేక్షకుల సాక్షిగా ఎందరో సింగర్స్‌కి లైఫ్ ఇచ్చారు.  ఉష , కౌసల్య , గోపికా పూర్ణిమ, మల్లిఖార్జున్, సందీప్, హేమచంద్ర, కారుణ్య ఇలా ఎందరెందరితో వందలాది పాటలు పాడించిన ఖ్యాతి, ఘనత ఎస్పీ బాలుకే దక్కింది.

ఈటీవిలో ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం 1996 మే 16న ప్రారంభమై.. నిర్వరామంగా ప్రసారమవుతూ.. భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షోగా సంగీత ప్రియులకు వినోదాన్ని పంచింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సాలూరి రాజేశ్వరరావు, కె.విశ్వనాధ్, కె.వి. మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా, కె.బాలచందర్, కీరవాణి, సుశీల, జానకి లాంటి ప్రముఖులెందరో ఈ కార్యక్రమంలో పాల్గొని బాలుతో ఉన్న అనుబంధాన్ని పంచుకునేవారు.ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios