బాలీవుడ్ మెరుపుతీగ దీపికా పదుకొనె చాలా తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగింది. కురాళ్ళ మతిపోగోట్టే అందం, నటన, డాన్సులతో వేగంగా స్టార్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో దీపిక ఒకరు. అనేక ప్రేమ వ్యవహారాల తర్వాత రణవీర్ సింగ్ ని వివాహం చేసుకుంది. 

కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ పై కూడా వీరిద్దరూ సూపర్ హిట్ జోడిగా నిలిచారు. ప్రస్తుతం ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకొనె ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ దీపికా ఇటీవల సోషల్ మీడియాలో ఓ హింట్ ఇచ్చింది. రణవీర్ సింగ్ ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో చాట్ సెషన్ నిర్వహిస్తున్నాడు. దీపికా కూడా కొంత సమయం తర్వాత ఈ చాట్ సెషన్ లో జాయిన్ అయింది. అభిమానులతో పాటు దీపికా కూడా రణవీర్ కు ఓ మెసేజ్ పెట్టింది. ఒక బేబీ ఎమోజిని పోస్ట్ చేసి దానికి 'హాయ్ డాడీ' అని కామెంట్ పెట్టింది. 

దీనితో దీపికా త్వరలో తల్లి కాబోతోందని అభిమానుల్లో చర్చ జరుగుతోంది. కొద్దిసేపటికే అర్జున్ కపూర్ కూడా రణవీర్ ని ఉద్దేశించి ఓ కామెంట్ పెట్టాడు. ' రణవీర్ భయ్యా.. వదిన నీకో సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది' అని కామెంట్ చేశాడు.