కమిడియన్ గా కాదు..ఏకంగా హీరోగానే బండ్ల గణేష్

గత కొన్నేళ్లలో బండ్ల ఇమేజ్ పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో సినిమాలో అతడు హీరోగా ఎంట్రీ ఇస్తే.. సీన్‌కు హీరోల రేంజిలో థియేటర్లలో అరుపులు, కేరింతలు కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

Is Bandla Ganesh playing a hero in a new film? jsp

పెద్ద పెద్ద సినిమాలు తీసి బడా ర్మాతల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ ..'సరిలేరు నీకెవ్వరు'తో మళ్లీ నటుడిగా రీఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో బండ్ల మళ్లీ కామెడీ రూట్లోకి వచ్చారు. ఇందులో సినిమాకే హైలైట్‌గా నిలిచే ట్రైన్ ఎపిసోడ్ ఒకటి. దాదాపు అరగంట పాటు ఉండే ఎపిసోడ్ లో బండ్ల కనిపించారు. ఆ సీన్స్ లో ఆయనో దొంగ గా కనిపించి నవ్వించే ప్రయత్నం చేసారు. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో మళ్లీ వరస పెట్టి నటుడుగా సినిమాలు చేద్దామనే నిర్ణయానికి బ్రేక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన తెరపై కనపడటానికి రంగం సిద్దం అవుతోందిట. అయితే ఈ సారి కమిడియన్ గా మాత్రం కాదట. ఫుల్ లెంగ్త్ హీరోగా కనిపిస్తాడని చెప్తున్నారు.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..బండ్ల గణేష్ ఓ చిన్న సినిమాలో లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు. వెంకట్ అనే కొత్త దర్శకుడు డైరక్ట్ చేయబోతున్నారు. ఆ పాత్రను అనుసరించి వివాదాస్పదంగా, ఫన్నీ ఇమేజ్ ఉన్న నటుడు కావాలిట. తెలుగులో పృధ్వి, బండ్ల గణేష్ ఆ పాత్రకు సరిపోతారని భావించారట. ఫైనల్ గా బండ్ల గణేష్ ని ఎప్రోచ్ అయ్యారని సమాచారం. అయితే బండ్ల గణేష్ మొదట కాదన్నా తర్వాత దర్శకుడు కమిట్మెంట్ చూసి ఓకే చెప్పారట. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన ఏదీ లేదు. 
 
ఇక తెలుగులో కమెడియన్ గా మంచి పీక్స్ లో ఉండగా నిర్మాత అవ‌తార‌మెత్తాడు బండ్ల గ‌ణేష్. ఒకప్పుడు అనేక స్టార్ హీరోల సినిమాల‌లో కమెడియన్ పాత్రల్లో అదరకొట్టిన బండ్ల గణేష్ బడా స్టార్స్ తో సినిమాలు సైతం నిర్మించాడు. కమెడియన్ గా ఎంతగా సంపాదించాడో కానీ ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్నాడు అని అప్ప‌ట్లో చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ఒక బడా రాజకీయ నాయకుడు బండ్ల వెనుక షాడోలా నిలబడి.. బండ్ల చేత సినిమాలు నిర్మించాడనే ప్రచారం జోరుగా జరిగింది. ఇక బడా సినిమాలు చేసి కొన్ని హిట్స్ కొట్టి…. కొన్ని డిజాస్టర్స్ తో సినిమాల నిర్మాణానికి దూరమైయ్యాడు. మధ్యలో బాలీవుడ్ నటుడు, నిర్మాత సచిన్ జోషితో వివాదం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో ఫ్లాప్ అయ్యాడు. దాంతో గ్యాప్ తీసుకుని ఇదిగో మళ్లీ నటుడుగా,నిర్మాతగా మళ్లీ మన ముందుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios