ఆ క్రేజీ కాంబోను సెట్ చేస్తూ.. మళ్లీ రంగంలోకి దిగుతున్న బండ్ల గణేష్?

ప్రముఖ నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) నటుడిగా ‘డేగల బాబ్జీ’తో అలరించిన విషయం తెలిసిందే. మరోవైపు నిర్మాత  త్వరలో ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు తెలుస్తోంది. 
 

Is Bandla Ganesh going to make a film with Senior Hero again?

ప్రముఖ నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమెడియన్ గా, నటుడిగా, ప్రొడ్యూసర్ గా తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. నటుడిగా చాలా సినిమాల్లో అలరించిన ఆయన.. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు బ్లాక్ బాస్టర్ సినిమాలను అందించారు. అనతికాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్ గానూ ఎదిగారు. నిర్మాతగా ‘గబ్బర్ సింగ్’,‘ఇద్దరమ్మాయిలు’, ‘టెంపర్’, ‘బాద్షా’ చిత్రాలతో కమర్షియల్ హిట్ అందుకున్నారు. అయితే కొన్నేండ్లుగా బండ్ల గణేష్ నిర్మాతగా ఎలాంటి సినిమాలు రావడం లేదు. చాలా కాలం తర్వాత ఆయన నుంచి మరో గుడ్ న్యూస్ రాబోతుందంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 

చివరిగా  పూరి జగన్నాథ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ చిత్రానికి ప్రొడ్యూస్ చేశారు.  ఆ తర్వాత ఎలాంటి చిత్రం రాలేదు. ప్రస్తుతం ఓ క్రేజీ కాంబినేషన్ ను మళ్లీ  రిపీట్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ వర్గాల నుంచి సమాచారం. దాని ప్రకారం.. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) - గోపీచంద్ మాలినేని  కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఈ క్రేజీ  కాంబోలో గతంలో ‘క్రాక్’విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ అదే కాంబోను సెట్ చేస్తూ నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హిట్స్ మీద హిట్స్ అందుకుంటూ జోరు మీద ఉన్నారు. మరోవైపు బండ్ల గణేష్ రవితేజ నటించిన ‘ఆంజనేయులు’ చిత్రంతోనే  నిర్మాతగా కేరీర్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో చాలా కాలం తర్వాత మళ్లీ మాస్ మహారాజాతోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నారని  అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.   ఇదే నిజమైతే మాస్ మహారాజా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందినట్లే. ఇక బండ్ల గణేష్ నటుడిగా ఆయా చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు.  మరోవైపు సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఆయా అంశాలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios