ఈ సినిమాతో బన్నీ పూర్తిగా మాస్ లోకి వెళ్లిపోయాడు. ఆ తరవాత అల్లు అర్జున్ తో ఇంకో సినిమా చేయాలని బోయపాటి ప్రయత్నించినా సెట్ కాలేదు.
అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్టైన మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘సరైనోడు’. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్లు గా చేసిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో విలన్ గా నటించగా శ్రీకాంత్ సహాయ పాత్రలో నటించాడు. 2016 వ సంవత్సరం ఏప్రిల్ 22న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా తర్వాత కలెక్షన్స్ కుమ్మేసాయి. ‘సరైనోడు’ చిత్రానికి రూ.53.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.73.87 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తం మీద బయ్యర్లకి రూ.20.47 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ.అల్లు అర్జున్ కెరీర్లో అప్పటికి ఇదే హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ.
ఈ సినిమాతో బన్నీ పూర్తిగా మాస్ లోకి వెళ్లిపోయాడు. ఆ తరవాత అల్లు అర్జున్ తో ఇంకో సినిమా చేయాలని బోయపాటి ప్రయత్నించినా సెట్ కాలేదు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చిందంటన్నారు. అల్లు అర్జున్ కూడా బోయపాటితో పనిచేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. రీసెంట్ గా బోయపాటి తో ఈ ప్రాజెక్టుకు సంభందంచిన డిస్కషన్స్ మొదలయ్యాయని మీడియా వర్గాల సమాచారం.
బన్నీని నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బోయపాటి అల్లు అర్జున్ ని కలిసారు. వీరిద్దరి మధ్యఈ కొత్త సినిమాకి సంబంధించిన చర్చలు జరిగాయని వార్తలు ఊపందుకున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే ఈకాంబోలో ఓ సినిమా చేసే అవకాశాలు ఉంది. ఎప్పుడు ఈ ప్రాజెక్టు ఉండచ్చు అంటే.. పుష్ప 2 షూట్ పూర్తైన వెంటనే.. త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తాడు అల్లు అర్జున్. ఆ తరవాత అట్లీ తో చేస్తాడా బోయపాటి తో చేస్తాడా అనేది చూడాలి. ఏదైమైనా సరైనోడు 2 మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
ఇక ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ స్లైలిస్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. సరికొత్తగా డీ గ్లామర్‌గా కనిపించడంతో పాటు తన నటనతో ఈ సినిమాను నిలబెట్టాడు. అందుకే అతన్ని జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వెతుక్కుంటూ వచ్చింది. . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను 2024 ఆగష్టు 15న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.