సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తోన్న సినిమా 'భైరవగీత' రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాతో సిద్ధార్థ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

కన్నడ నటుడు ధనుంజయ హీరోగా నటిస్తుండగా.. ఇర్రా మోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ లు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ట్రైలర్ లో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి.

ఈ విషయాన్ని హీరోయిన్ ఇర్రా మోర్ వద్ద ప్రస్తావించగా.. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అలా నటించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది.

''ఈ సినిమాలో ఇద్దరి ప్రేమికుల మధ్య ప్రేమను తెలియజేసేందుకు లిప్ లాక్ సీన్లు తప్పవు. వందలాది మంది మధ్యలో అలా నటించడం నాకు అసలు నచ్చలేదు. కానీ హీరోయిన్ గా అది నా బాధ్యత అని భావించి అలాంటి సన్నివేశాల్లో నటించాను'' అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో నవంబర్ 30న విడుదల కానుంది.