ఇర్ఫాన్ ఖాన్ ఓ అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో `మేరా సాయా కి తేరా సాయా?` అంటూ విదేశాల్లో తన భార్య సుతపా సిక్దర్ తో కలిసి సరదాగా తిరుగుతూ పాడుకుంటున్నారు.
ఇర్ఫాన్ ఖాన్.. బాలీవుడ్ విలక్షణ నటుడు. నో డౌట్ ఆయన ఒక లెజెండ్. హిందీతోపాటు ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన యూనివర్సల్ యాక్టర్. ఆయన తన అభిమానులను, చిత్ర పరిశ్రమకి షాక్ ఇస్తూ క్యాన్సర్‌తో కన్నుమూశారు. దీంతో అంతా దుఖ సాగరంలో మునిగిపోయారు.
తాజాగా ఇర్ఫాన్ ఖాన్ ఓ అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో `మేరా సాయా కి తేరా సాయా?` అంటూ విదేశాల్లో తన భార్య సుతపా సిక్దర్ తో కలిసి సరదాగా తిరుగుతూ పాడుకుంటున్నారు. ఆ పాటలోని అర్థం అభిమానులను కన్నీళ్ళు పెట్టిస్తుంది. అభిమానులు ఎమోషనల్‌గా ట్వీట్లు పెడుతున్నారు.
ఈ వీడియోని ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇర్ఫాన్ క్యాన్సర్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 29న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ ఖాన్ తెలుగులో `సైనికుడు` చిత్రంలో నటిస్తున్నారు.
