కోలీవుడ్ స్టార్ హీరో ఇలయథలపతి విజయ్ 63వ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అట్లీ విజయ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తేరి - మెర్సల్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం రానున్న ఈ కాంబినేషన్ పై సౌత్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. 

అయితే జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకు టైటిల్ - విజయ్ లుక్ వంటి విషయాలను బయటపెట్టని చిత్ర యూనిట్ ఆ రోజు అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా సర్‌ప్రైజ్ ను ప్లాన్ చేస్తోంది. 

ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం అనంతరం మళ్ళీ విజయ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు టాక్. ఇక సినిమాను దీపావళి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.