టాలీవుడ్ లో ఇప్పుడొస్తున్న కథలు చాలా ప్రయోగాత్మకంగా ఉన్నాయని చెప్పాలి. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా దర్శకులు కూడా ఎక్కువగా వినూత్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యువ హీరోలు సైతం అలాంటి కథలనే ఒకే చేస్తున్నారు. ఇక త్వరలోనే వరుణ్ తేజ్ నటించిన స్పెస్ థ్రిల్లర్ అంతరిక్షం రాబోతున్న సంగతి తెలిసిందే. 

ఎంతో ప్రయోగాత్మకంగా తెరక్కుతున్న ఈ సినిమాకు ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా చిత్రీకరణను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో చిత్ర యూనిట్ బిజీగా మారింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. సినిమాలో వరుణ్ చేస్తోన్న వ్యోమగామి పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుందట. 

దేశం కోసం స్పెస్ లో ఒక ప్రమాదకరమైన మిషన్ ను తెలివిగా పూర్తి చేసే వరుణ్ తన దేశాన్ని గర్వపడేలా చేస్తాడట.అంతరిక్షంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి ఊహించని అనుభవాన్ని కలుగజేస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా గ్రాఫిక్స్ పనులు ఎండింగ్ వచ్చాయి. రీసెంట్ గా టీజర్ అందరిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇక అంతరిక్షం సినిమా డిసెంబర్ 21న విడుదలకానుంది.