Asianet News TeluguAsianet News Telugu

నరేష్, రాహుల్ రామకృష్ణ నటించిన ‘ఇంటింటి రామాయణం’.. ‘ఆహా’లో స్ట్రీమింగ్ కు సిద్ధం.. ఎప్పుడంటే?

కథ బాగుంటే చిన్న సినిమాలూ దుమ్ములేపుతున్నాయి. ఇదే ఫార్మూలాతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ కూడా ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ నే తీసుకొస్తుంది. తాజగా ‘ఇంటింటి రామాయణం’ అనే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో అలరించబోతోంది. 
 

Intinti Ramayanam movie ready for streaming on Aha, whe?
Author
First Published Nov 21, 2022, 2:56 PM IST

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్థాపించిన ఆహా (Aha) ప్రస్తుతం తెలుగు ఓటీటీ రంగంలో అగ్రగామిగా ఉంది. ఆహాలో వస్తోన్న షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కథ బాగుంటే చిన్న సినిమాలనూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపుతున్నాయి. ఇదే ఫార్మూలాతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ కూడా ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ నే తీసుకొస్తుంది. తాజాగా ‘ఇంటింటి రామాయణం’ అనే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో అలరించబోతోంది. 

యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఆధ్వర్యంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్,, ఆహా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’ (Intinti Ramayanam). 
డిసెంబర్ 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్‌ నారెడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా ద్వారా ఓటీటీలోకి ప్రవేశించనుంది. 

మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరీంనగర్ ప్రాంతంలో నివసించే రాములు (నరేష్‌) కుటుంబం ఓ సమస్యల్లో చిక్కుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యుల్లోనే ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగి ఉన్న అసలు రూపాలన్నీ బయటకు వస్తాయి. త్వరలోనే ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 21న‌ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసారు.

ఓటీటీలోకి ఇలా తొలిసారిగా ఎంట్రీ ఇస్తుండటంపై సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఎంతో మంది మంచి నటులున్నారు. ఎంతో గొప్ప టీం పని చేసింది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బాగా రావాలని కష్టపడ్డారు. ఆహాలో రాబోతోన్న మా ఈ చిత్రం ఇంటింటి రామాయణం అందరికీ ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. మానవ బంధాలు, సంబంధాలు, జీవిత గుణపాఠాలు ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించాం. అంతా మనకు తెలిసిన ప్రపంచంలానే ఉంటుంది. కానీ కొత్తగా ఉంటుందని పేర్కొన్నారు. 

కలర్ ఫోటో, భీమ్లా నాయక్‌, డీజే టిల్లు, క్రాక్, అన్‌స్టాపబుల్ షో, డ్యాన్స్ ఐకాన్, తెలుగు ఇండియన్ ఐడల్, అన్యా ట్యూటోరియల్, గీతా సుబ్రహ్మణ్యం, 11th అవర్ వంటి మంచి కంటెంట్ ఉన్న ఆహాలో ఇప్పుడు ‘ఇంటింటి రామాయణం’ కూడా వచ్చి చేరనుంది. మున్ముందు కూడా ఆహా మరింత మంచి కంటెంట్‌తో ఆడియెన్స్‌ ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios