రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.  ఈ రోజున (మార్చి 29)న ఆంధ్రా మినహా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే అమెరికాలో షోలు పడ్డాయి. అక్కడ చూసిన వారి నుంచి అందుతున్న సమాచారం ఈ మేరకు ఈ సినిమాలో ఇంటర్వెల్ ...లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించటంపై వస్తుంది.

మోహన్ బాబు తో చేసిన మేజర్ చంద్రకాంత్ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. ఆ చిత్రం  వంద రోజుల పంక్షన్ ఘనంగా ఏర్పాటు చేస్తారు. ఆ పంక్షన్ కు లక్ష్మీ పార్వతిని ఒక అతిధిగా లిస్ట్ లో కలుపుతారు ఎన్టీఆర్. ఆ తర్వాత అదే పంక్షన్ లో తన వివాహ నిర్ణయం ఎన్టీఆర్ ప్రకటిస్తారు.  ఆ తన ఇంట్లో ఆమెను వివాహం చేసుకోవటం...ఆమె పార్టి మీటింగ్ లలో పాలుపంచుకోవటం జరుగుతుంది. అక్కడ నుంచే కథ మలుపుతిరుగుతుంది. ఈ సినిమాకు ఇదే ఫెరఫెక్ట్ ఇంటర్వెల్ అంటున్నారు చూసిన వాళ్లు. 

ఇక చిత్రం రిలిజ్ విషయానికి వస్తే... మంగళగిరి కోర్టు ఇచ్చిన స్టే పై స్పందించిన ఏపీ హైకోర్టు సినిమాను ఏప్రిల్ మూడు వరకూ విడుదల చేయరాదని ఆదేశించింది.ఈ నేపధ్యంలో ఆంధ్రలో ఈ చిత్రం రిలీజ్ కావటం లేదు. 

మరో ప్రక్క  తెలంగాణలో సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ కూడా సినిమా విడుదలపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. అనుకున్నట్లుగానే మార్చి 29 ఈ శుక్రవారం ఈ సినిమాను తెలంగాణా ఏపీలో చిత్ర విడుదలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాంగోపాల్‌ వర్మ శుక్రవారం ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు