యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సాహోపై అభిమానుల్లో మరింతగా ఆసక్తి పెంచేందుకు చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టబోతున్నట్లు ఇప్పటికే టీజర్ ద్వారా అర్థమైంది. తాజాగా ప్రభాస్ సాహో చిత్రం కోసం బాక్సింగ్ శిక్షణ పొందుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దర్శకుడు సుజిత్ ప్రభాస్ కు కొన్ని సూచనలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. కానీ ప్రభాస్ రియాక్షన్ మాత్రం నువ్వు చెప్పు నేను కొడతా అన్నట్లుగా ఉంటూ అభిమానులని ఆకట్టుకుంటోంది. సాహో చిత్రం నుంచి రిలీజవుతున్న పాటలకు మంచి స్పందన వస్తోంది. శ్రద్దా కపూర్ తన గ్లామర్ తో కనువిందు చేయబోతోంది. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 5, 2019, 5:31 PM IST