Asianet News TeluguAsianet News Telugu

గేమ్ ఛేంజర్ పై వినకూడని రూమర్స్.. బాబోయ్ శంకర్ ఏం చేస్తున్నారు ?

ఆడియన్స్ ని మునిపటిలా మెప్పించడంలో శంకర్ ఫెయిల్ అవుతున్నారు. ఇటీవల విడుదలైన భారతీయుడు 2 చిత్రంతో శంకర్ పై విమర్శలు వచ్చాయి. ఈ ఎఫెక్ట్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంపై పడింది.

Interesting update on Ram Charan and Shankar movie game changer dtr
Author
First Published Aug 26, 2024, 11:58 AM IST | Last Updated Aug 26, 2024, 11:58 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడిగా ఇండియా మొత్తం ప్రశంసలు దక్కించుకున్న దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే గత కొన్నేళ్లుగా శంకర్ పై ఫ్యాన్స్ లో నమ్మకం సన్నగిల్లుతోంది. 

ఆడియన్స్ ని మునిపటిలా మెప్పించడంలో శంకర్ ఫెయిల్ అవుతున్నారు. ఇటీవల విడుదలైన భారతీయుడు 2 చిత్రంతో శంకర్ పై విమర్శలు వచ్చాయి. భారతీయుడు 2బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఎఫెక్ట్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంపై పడింది. గేమ్ ఛేంజర్ చిత్రంపై అంచనాలు తీసుకురావడం శంకర్ కి బిగ్గెస్ట్ సవాల్ అని చెప్పొచ్చు. దీనికి తోడు చాలా కాలంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతూనే ఉంది. 

ఇటీవల చరణ్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు. కానీ కానీ కొన్ని సీన్లు సరిగ్గా రాకపోవడంతో రీ షూట్ చేయాలని శంకర్ భావిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత శంకర్ కి గేమ్ ఛేంజర్ మూవీ ప్రెస్టేజ్ ఇష్యూ గా మారింది. దీనితో చిన్న తప్పు కూడా ఉండకూడదని శంకర్ భావిస్తున్నారు. 

కొన్ని సీన్లు మార్చాలని శంకర్ అనుకుంటున్నారట. దీనితో రీ షూట్ చేయాలంటే రాంచరణ్ డేట్లు కొన్ని రోజులు అవసరం అవుతాయి. అందుకని ప్రస్తుతం దిల్ రాజు రాంచరణ్ ని రిక్వస్ట్ చేసే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

సినిమా రిలీజ్ అయ్యాక బాధపడడం కంటే.. ముందే జాగ్రత్తపడితే అవుట్ పుట్ బావుంటుందని శంకర్ భావిస్తున్నారు. రాంచరణ్ త్వరలో బుచ్చిబాబు చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో చరణ్ కి రీ షూట్ చేయడం వీలవుతుందో లేదో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios