ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ కోసం రంగంలోకి దిగిన ఐదు కంపెనీలు.. ఇంతకీ ఏం చేస్తున్నారంటే?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్టున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కే’. చిత్రాన్ని విజువల్ వండర్ గా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఐదు కంపెనీలు సినిమా కోసం వర్క్ చేస్తున్నట్టు ప్రొడ్యూసర్ తెలిపారు.
యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తొలిసారిగా రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కే’ (Project K). చిత్రాన్ని రూ.500 కోట్లకు పైగా వెచ్చిస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం శరవేగంగా కొనసాగుతోంది. మరికొద్ది షెడ్యూళ్లలో షూటింగ్ కూడా పూర్తి కానుంది. ఈ సందర్భగా ప్రొడ్యూసర్ అశ్విన్ దత్, చిత్ర యూనిట్ సినిమాపై అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు.
తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ అశ్విని దత్ మాట్లాడుతూ..‘ప్రాజెక్ట్ కే’ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమాలో భారీ విజువల్స్ కనిపిస్తాయన్నారు. ఐదు నెలల కిందనే VFX వర్క్ ప్రారంభించినట్టు తెలిపారు. ఇందుకోసం ఏకంగా ఐదు వీఎఫ్ఎక్స్ కంపెనీలు శ్రమిస్తున్నాయన్నారు. దీంతో గ్రాఫిక్ కు సంబంధించిన పనులు చకా చకా కొనసాగుతున్నాయని తెలిపారు. సినిమాపై తనకు భారీ అంచనాలు, బలమైన నమ్మం ఉందని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ప్రాజెక్ట్ కే షూటింగ్ 70 శాతం పూర్తైందని తెలిపారు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), దీపికా పదుకొణె (Deepika Padukone)కు కేవలం 7 నుంచి 10 రోజుల వర్క్ మాత్రమే మిగిలిపోయి ఉందన్నారు. ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే పైనే ఫోకస్ పెట్టారన్నారు. ఈ మూడు క్యారెక్టర్లే సినిమా మొత్తాన్ని నడిపిస్తాయని కూడా చెప్పారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. భారీ విజువల్స్ పాన్ వరల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నాగ్ అశ్మిన్ బలమైన కథను రాసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లను చూస్తుంటే.. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్న విషయం అర్థం అవుతోంది. ఇక ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం గ్రాఫిక్ వర్క్ పేళవంగా ఉండటంతో ఫ్యాన్స్ అప్సెట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘ప్రాజెక్ట్ కే’ గ్రాఫిక్ వర్క్ మాత్రం ఫ్యాన్స్ ను అబ్బురపరిచేలా వీఎఫ్ఎక్స్ వర్క్ కొనసాగిస్తున్నారు. ఇందుకోనం ఏకంగా ఐదు కంపెనీలను రంగంలోకి దించి మంచి అవుట్ పుట్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు టీమ్. ఇక చిత్రానికి సంతోష్ నారాయణ్ తో పాటు మరో బాలీవుడ్ లేడీ మ్యూజిషీయన్ సంగీతం అందిస్తున్నట్టు తాజాగా నిర్మాత అశ్విని దత్ వెల్లడించారు.