చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న డెబ్యూ మూవీ ఉప్పెన. మైత్రి మూవీస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చి బాబు ఈ చిత్రానికి దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నెల రోజులుగా కాకినాడ తీరంలో జరుగుతోంది. 

సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాకినాడలో షెడ్యూల్ ముగిసాక ఉప్పెన చిత్ర యూనిట్ ఈశాన్య రాష్ట్రాలకు పయనం కానుంది. సిక్కిం, గ్యాంగ్ టక్ లాంటి ప్రాంతాల్లో 20 రోజుల పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ మత్సకారుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు షూటింగ్ కోసం వెళుతున్నారు.. కథతో ఏమైనా లింక్ ఉందా అనే అంశాలు ఆసక్తిని రేపుతున్నాయి. మరో షెడ్యూల్ ని హైదరాబాద్ లో పూర్తి చేస్తారు. దీనితో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవుతుంది.