ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రారంభమై ఏడాది గడుస్తున్నా ఇంకా విలన్ దొరకలేదు.
హీరో నితిన్ కి ఇటీవల అంతగా కలసి రావడం లేదు. నితిన్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. గత ఏడాది నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు.
వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రారంభమై ఏడాది గడుస్తున్నా ఇంకా విలన్ దొరకలేదు. షూటింగ్ జరుగుతోంది కానీ విలన్ సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదు. ఎట్టకేలకు ఈ చిత్రానికి విలన్ దొరికినట్లు తెలుస్తోంది.
మలయాళీ యువ నటుడు సుదేవ్ నైర్.. నితిన్, వక్కంతం వంశీ చిత్రంలో విలన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే సుదేవ్ సెట్స్ లో కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. చిత్రయూనిట్ ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. సుదేవ్ మలయాళంలో మై లైఫ్ పార్ట్నర్, సీబీఐ 5, భీష్మ పర్వం లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నితిన్ తన సొంత ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ లో నిర్మిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. హ్యారిస్ జైరాజ్ సంగీత దర్శకుడు. విడుదలకి సంబందించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక భీష్మ కాంబినేషన్ పై నితిన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
