భారీ అంచనాల నడుమ విడుదలైన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతికి విడుదలై దారుణంగా నిరాశపరిచింది. ఈ ప్రభావం దర్శకుడు బోయపాటి శ్రీనుపైన బాగానే పడింది. వినయవిధేయ రామ చిత్రం విషయంలో బోయపాటిపై విమర్శలు వినిపించాడు. ఈ చిత్రం తర్వాత బోయపాటి బాలయ్యతో కమిటయ్యారు. కానీ ఎందుకో బాలయ్య, బోయపాటి ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అటకెక్కింది. దీనితో బోయపాటి తదుపరి చిత్రం విషయంలో అనిశ్చితి నెలకొంది. 

ఎట్టకేలకు బోయపాటి శ్రీను తన నెక్స్ట్ మూవీని ఖరారు చేసుకున్నాడు. సరైనోడు చిత్రంతో బోయపాటి బన్నీకి తిరుగులేని హిట్ అందించాడు. అల్లు అర్జున్ తోనే బోయపాటి నెక్స్ట్ మూవీ ఉండబోతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించనున్నారు. 

నవంబర్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. వేణుశ్రీ రామ్ దర్శకత్వంలో ఐకాన్ చిత్రం, సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించాల్సి ఉంది.