గ్యాంబ్లింగ్ నేపథ్యంలో... 80, 90ల కాలంలో సాగే కథను కరుణ కుమార్ రెడీ చేశారట. స్క్రిప్ట్ కోసం ఆయన చాలా రీసెర్చ్ చేశారని తెలిసింది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కానుండగా.. ఇప్పుడు మరో కొత్త సినిమాకు సైన్ చేసారు. డైరెక్టర్ పేరు కూడా కన్‌ఫర్మ్ అయిపోగా.. ఈ కాంబినేషన్ ఇంట్రస్టింగ్ గా ఉంది. వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సినిమా చేయడానికి సైన్ చేశారు. ఇటీవలే మూవీ ప్రొడక్షన్‌లోకి ఎంటరైన వైరా ఎంటర్‌టైన్మెంట్స్.. మొదటి సినిమాగా నేచురల్ స్టార్ నానితో NANI30 చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక తమ రెండో సినిమాను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో నిర్మించడానికి సిద్ధమైంది.
‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ తన స్క్రిప్ట్‌తో వరుణ్ తేజ్‌ను ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తుండగా.. మొత్తానికి ప్రాజెక్ట్ లాక్ చేసినట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. కరుణ కుమార్ అండ్ టీమ్.. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌ను ఫైనల్ చేసే పనిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘మట్కా’ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇదొక పీరియడ్ క్రైమ్ ఫిల్మ్ అని సమాచారం.
విశాఖ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్ సినిమా ఉంటుందని తెలిసింది. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో... 80, 90ల కాలంలో సాగే కథను కరుణ కుమార్ రెడీ చేశారట. స్క్రిప్ట్ కోసం ఆయన చాలా రీసెర్చ్ చేశారని తెలిసింది. ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. క్యారెక్టర్ కోసం ఆయన మేకోవర్ కూడా కానున్నారట.
పలాస సినిమాతో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ దర్శకుడు. ఆ తర్వాత సుధీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు కానీ.. మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆతర్వాత సత్యం రాజేష్ తో కళాపురం అనే చిత్రం చేసారు. ఆ సినిమా వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడీ సినిమాపై పూర్తి దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రానికి వరుణ్ తేజ్ ఇంకా డేట్స్ కేటాయించలేదు. ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారు అనేది స్పష్టత రావాల్సివుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవధారి అర్జున’ సినిమా చేస్తున్నారు. అలాగే శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఒకటి షూట్ పూర్తై రిలీజ్ కు రెడీ అయ్యింది. త్వరలోనే కరుణ్ కుమార్ సినిమాని పూర్తి వివరాలతో ప్రకటించనున్నారు.
