బిగ్ బాస్ సీజన్ 3లో తొలి మూడు వారలు ప్రేక్షకులు ఊహించిన విధంగానే ఎలిమినేషన్స్ జరిగాయి. తొలి వారం హేమ హౌస్ నుంచి బయటకు వెళ్లగా రెండవ వారం జాఫర్, మూడవ వారం తమన్నా ఎలిమినేట్ అయ్యారు. ఇక నాల్గవ వారం హౌస్ లో ఎలిమినేషన్ కొరకు ఏకంగా 8 మంది సెలెబ్రిటీలు నామినేట్ కావడం విశేషం. 

వీరిలో ఆదివారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. రవికృష్ణ, రోహిణి, శివజ్యోతి, శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ నామినేషన్ లో ఉన్నారు. శనివారం రోజు వీరిలో శివజ్యోతి, వరుణ్ సేఫ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. దీనితో మిగిలినవారిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరనే దానిపై సోషల్ ఎండియాలో లీకులు వినిపిస్తున్నాయి. 

సీరియల్ నటి రోహిణి ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రోహిణితో పాటు శివజ్యోతి, రాహుల్ లకు కూడా తక్కువ ఓట్లు వచ్చాయట. వీరిలో శివజ్యోతి సేఫ్ అయిపోయింది కాబట్టి ఇక మిగిలింది రోహిణి, రాహుల్. 

పునర్నవితో రాహుల్ కొనసాగిస్తున్న రొమాంటిక్ ట్రాక్ అతడికి కలసి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో రోహిణిపై ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేకున్నా ఆమె ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తో నాగార్జున బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. డబుల్ ఎలిమినేషన్ తర్వాత మరో వైల్డ్ కార్డు ఎంట్రీని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో మరి.