కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 షోలో ఇంటి సభ్యుల మధ్య వ్యవహారం రోజు రోజుకు హీటెక్కుతోంది. శుక్రవారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో బిగ్ బాస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. హిమజ ఆమ్లెట్ తింటుండగా బాబా భాస్కర్ ఏదో అంటాడు. దానికి హిమజ ఫీలవుతుంది. 

కొద్దిసేపటికి ఆమె కోపం కట్టలు తెంచుకోవడంతో కిచెన్ లో ఉన్న కోడి గుడ్లని పగలకొట్టేస్తుంది. హిమజ బిహేవియర్ కు హోస్ మేట్స్ అంతా షాక్ కి గురయ్యారు. హిమజ ఈ వారం ఆల్రెడీ నామినేషన్ లో ఉంది. దీనితో ఆమె ప్రవర్తన వల్ల ఈ వారం ఎలిమినేట్ అయ్యేది హిమాజే అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. 

కానీ హిమజ అభిమానులు మాత్రం వేరేలా స్పందిస్తున్నారు. హిమజ అలా ప్రవర్తించదని, ఆమె క్యారెక్టర్ అది కాదని అంటున్నారు. ప్రోమోలో చూపించింది నిజం కాదు. బహుశా బిగ్ బాస్ ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చి ఉంటారు. అందువల్లే హిమజ అలా ప్రవర్తించింది అని ఆమె సపోర్టర్స్ అంటున్నారు. ఇందులో ఎంతమాత్రం వాస్తవం ఉందొ శుక్రవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ద్వారా తేలనుంది.