నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది.

నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ వరుసగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. 

కంగనా రనౌత్ కి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులతో వివాదాలు ఉన్నాయి. అందులో బాలీవుడ్ సీనియర్ రచయిత, లిరిసిస్ట్ జావేద్ అక్తర్ కూడా ఉన్నారు. 2016 నుంచి కంగనా, జావేద్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటోంది. 2020లో జావేద్ అక్తర్ కంగనా రనౌత్ పై పరువునష్టం దావా కేసు వేశారు. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతోనే ఉంది. ఒక న్యూస్ ఛానల్ లో తన ప్రతిష్టకు భంగం కలిగేలా కంగనా ప్రవర్తించింది అంటూ జావేద్ ఆమెపై కేసు నమోదు చేశారు. 

తాజాగా కోర్టులో ఈ కేసు హియరింగ్ కి వచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 19న జరగాల్సి ఉంది. కానీ ముందుగానే విచారణ చేపట్టాలని జావేద్ తరుపున లాయర్ పిటిషన్ వేసారు. తన క్లయింట్ 78 ఏళ్ల వయసు వ్యక్తి అని.. ఎక్కువ రోజులు వాయిదా వేయడం సబబు కాదని లాయర్ పిటిషన్ లో పేర్కొన్నారు. 

జావేద్ లాయర్ వేసిన పిటిషన్ కి సమాధానం ఇవ్వాలని అంటూ కోర్టు కంగనా రనౌత్ ని ఆదేశించింది. ఈ కేసు గత ఏడాది నవంబర్ లో చివరగా విచారణ జరిగింది. తదుపరి విచారణ ఏప్రిల్ లో అంటే దాదాపు ఐదు నెలలు వాయిదా పడింది. ఈ కేసు విచారణని త్వరగా జరపాలన్న జావేద్ డిమాండ్ పై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి. 

2016లో జావేద్ తనని మీటింగ్ కి పిలిచి లైంగికంగా వేధించారు అని అని కంగనా అతడిపై ఆరోపణలు చేస్తోంది.కంగనా రనౌత్ కూడా జావేద్ అక్తర్ పై కేసు నమోదు చేసింది. జావెద్ తనపై నమోదు చేసిన కేసుపై గతంలో కంగనా మాట్లాడుతూ.. తనకి, హృతిక్ రోషన్ కి జరిగిన సంఘటనలో జావేద్ కి తలదూర్చే హక్కే లేదని ఆరోపించింది.