స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ గత ఏడాది మీడియాలో హాట్ టాపిక్ గా మారడు. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం నేపథ్యంలో శ్రీరెడ్డి అతడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కొన్ని ఫోటోలు కూడా బయటపెట్టింది. తాజాగా అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం సురేష్ బాబు అభిరామ్ కోసం పలు కథలు వింటున్నారట. హిందీ చిత్రాలని రీమేక్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారట. ఇక టాలెంట్ ఉన్న పలువురు యువ దర్శకులని కూడా సురేష్ బాబు ప్రరిశీలిస్తున్నారట. ఆ క్రమంలో రాహుల్ రవీంద్రన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 

అభిరామ్ ని హీరోగా లాంచ్ చేసే విషయంలో ఇప్పటికే సురేష్ బాబు, రాహుల్ రవీంద్రన్ మధ్య చర్చలు కూడా జరిగాయట. మన్మథుడు 2 చిత్ర రషెష్ ని ఇప్పటికే సురేష్ బాబు చూసి ఇంప్రెస్ అయ్యారట. వీలైనంత త్వరలో అభిరామ్ ని హీరోగా లాంచ్ చేయాలని సురేష్ బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం అభిరామ్ యూఎస్ లో నటనలో శిక్షణ పొందుతున్నాడు.