మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి చేయబోయే విన్యాసాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అమితం బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, నయనతార ఈ చిత్రంలో నటిస్తుండడంతో నార్త్ లో కూడా సైరాపై మంచి బజ్ నెలకొని ఉంది. 

ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో సైరా చిత్ర యూనిట్ అన్ని భాషల్లో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతోంది. అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి ట్రైలర్ ని సిద్ధం చేసి ఉంచారట. 

టీజర్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలని చూపించారు. ట్రైలర్ లో మాత్రం అద్భుతమైన డైలాగ్స్, కథ గురించి ప్రేక్షుకులకు ఓ అవగాహనా కలిగేలా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి పోరాటం బ్రిటిష్ వారితో ఎలా సాగిందనే విషయాన్ని ట్రైలర్ లో శాంపిల్ గా చూపించబోతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్, కర్నూలులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తోంది.