రష్మిక మందన ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ చిత్రంలో కాలేజీ అల్లరిపిల్లగా నటించి మెప్పించింది. ఆ తర్వాత విడుదలైన గీత గోవిందం చిత్రం రష్మిక క్రేజ్ ని డబుల్ చేసింది. ఈ ఏడాది రష్మిక డియర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన సంగతి తెలిసిందే. 

రష్మిక ప్రస్తుతం నితిన్ సరసన భీష్మ చిత్రంలో, సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉండగా రష్మికకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెకెక్కబోతున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో రష్మికని హీరోయిన్ గా ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రంగస్థలం తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సహజంగానే భారీ అంచనాలు ఏర్పడతాయి. ఈ చిత్రాన్ని కూడా సుక్కు పల్లెటూరి నేపథ్యంలోనే తెరకెక్కించబోతున్నట్లు టాక్. 

ఈ చిత్రంలో రష్మిక పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలవనునట్లు తెలుస్తోంది. పల్లెటూరి యువతిగా రష్మిక నటించబోతోందట. రంగస్థలంలో సమంత రామలక్ష్మి పాత్ర తరహాలో రష్మిక రోల్ ని సుకుమార్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ అలా వైకుంఠపురములో చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలో సుకుమార్ మూవీ ప్రారంభం కానుంది.