ఆర్ఎక్స్ 100 చిత్రం చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంతో హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతి ఫేమస్ అయిపోయారు. కార్తికేయ ప్రస్తుతం అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'గుణ 369' చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరక్కుతోంది. తాజాగా దర్శకుడు అర్జున్ జంధ్యాల గుణ 369 చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తెలుగులో కథాబలం ఉన్న చిత్రాలు రావడం లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. వారందరికీ సమాధానం చెప్పే విధంగా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. టీజర్ విడులయ్యాక అందరూ హీరోయిన్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారని దర్శకుడు తెలిపారు. 

హీరోయిన్ పేరు 'అనఘ'. టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న మరో కేరళ బ్యూటీ. సాయి పల్లవి, నిత్యామీనన్, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి మలయాళీ ముద్దుగుమ్మలంతా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అనఘ కూడా టాప్ రేంజ్ కు వెళుతుంది అని అర్జున్ తెలిపారు. 

గుణ 369 చిత్రం విడుదలయ్యాక అందరూ కార్తికేయ, అనఘ మధ్య రొమాన్స్ గురించే మాట్లాడుకుంటారు. గ్లామర్ విషయంలో అనఘ ఎక్కడా రాజీ పడలేదు. కమర్షియల్ హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలన్నీ అనఘలో ఉన్నాయని తెలిపారు.