Asianet News TeluguAsianet News Telugu

రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. థ్రిల్లింగ్ గా అనిపించే ప్లేస్ లో వివాహం, ఎప్పుడంటే

భల్లాల దేవుడు దగ్గుబాటి రానా తమ్మడు అభిరామ్ త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలు త్వరలో నిజం కాబోతున్నాయి.

interesting details about Daggubati abhiram marriage dtr
Author
First Published Sep 9, 2023, 5:07 PM IST

భల్లాల దేవుడు దగ్గుబాటి రానా తమ్మడు అభిరామ్ త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలు త్వరలో నిజం కాబోతున్నాయి.దగ్గుబాటి అభిరామ్ వివాహానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముహూర్తం డేట్, వివాహ వేదిక కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.  

అభిరామ్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. వాళ్ళ బంధువుల అమ్మాయినే అట. రామానాయుడు తమ్ముడి మనవరాలినే(రామానాయుడు తమ్ముడి కూతురు బిడ్డ) అభిరామ్ కి కాబోయే భార్యగా కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమ్మాయి కుటుంబం కారంచేడులో ఉంటోంది.  దగ్గుబాటి అభిరామ్, అమ్మాయి ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ఇష్టపడుతున్నారట. 

వీళ్లిద్దరి వివాహం గ్రాండ్ గా జరిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు ముహూర్తంతో పాటు వేదిక కూడా ఖరారు చేశారు. అభిరామ్ వివాహ వేడుక డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏ యూరప్ లోనో కాదు.. పక్కనే ఉన్న శ్రీలంకలో అట. 

డిసెంబర్ 6న వివాహ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకకి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. పెళ్లి కార్డులో కారంచేడులోని రామానాయుడిగారి పాత ఇంటిని అచ్చుగా వేయించబోతున్నారట. మొత్తంగా అభిరామ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 

హీరోగా ఎంట్రీ కాకముందే అనేక వివాదాల్లో అభిరామ్ నిలిచాడు. ఇప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఇండస్ట్రీలో నటుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు అభిరామ్ సోదరుడు రానా దగ్గుబాటి విలక్షణ నటుడిగా ఇండియా మొత్తం గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios