కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోపై రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. హౌస్ లో ప్రధాన పోటీగా భావించే ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. గత వారం రోహిణి ఎలిమినేట్ కాగా, ఈ వారం అనూహ్యంగా అషురెడ్డిని బయటకు పంపారు. దీనితో వైల్డ్ కార్డు ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. 

వైల్డ్ కార్డు ఎంట్రీ విషయంలో ఇప్పటికే శ్రద్దా దాస్, హెబ్బా పటేల్, ఇషా రెబ్బ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఊహాగానం జోరందుకుంది. హాట్ బ్యూటీ శ్రద్దా దాస్, యంగ్ బ్యూటీ ఇషా రెబ్బాలలో ఎవరో ఒకరు ఈ వారమే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. 

హీరోయిన్లని హౌస్ లోకి పంపడడం ద్వారా బిగ్ బాస్ షోకు మరింత గ్లామర్ పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కానీ వీరి ఎలా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నాని హోస్ట్ గా వ్యవహరించిన గత సీజన్ లో నటి పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో తెల్లవారు జామున పూజా హౌస్ లోకి ప్రవేశించింది. 

ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీని క్రేజీగా ప్లాన్ చేసిఉంటారని అభిమానులు భావిస్తున్నారు. తమన్నా సింహాద్రి ఎంట్రీ చాలా నార్మల్ గా జరిగింది. కానీ ఈసారి మాత్రం ఇంట్లోని సభ్యులు ఆశ్చర్యపోయేలా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండాలని నిర్వాహకులు భావిస్తున్నారట.