నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఎంతో ఇష్టపడి బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహా నాయకుడు రెండు భాగాలు ఆకట్టుకోలేక పోయాయి. అయినా కూడా బాలయ్య జోరు తగ్గడంలేదు. 

ఎన్నికల తర్వాత బాలకృష్ణ స్పీడు పెంచాడు. బాలకృష్ణ ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జైసింహా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం ఇది. ఎన్నికల తర్వాత బాలయ్య బోయపాటి చిత్రంలో నటించాల్సింది. కానీ రవికుమార్ కు అవకాశం ఇచ్చాడు. మళ్ళీ బాలయ్య బోయపాటిని పిలిపించుకుని మాట ఇచ్చాడట. 

ఈ చిత్రం తర్వాత కథకు అవసరమైన విధంగా లుక్ మార్చుకుని నీ దర్శకత్వంలో నటిస్తానని బోయపాటికి చెప్పాడట. అంతా సిద్ధం చేసుకుకోమని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు దిల్ రాజు బాలయ్య కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. పింక్ రీమేక్ లో బాలయ్యని నటింపజేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు. 

పైసా వసూల్ తో బాలయ్యకు హిట్ ఇవ్వలేకపోయిన పూరి మరోసారి బాలయ్యని మెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య ఈ ఏడాది నటించబోయే చిత్రాలు ఇవే.