నందమూరి బాలకృష్ణ నటించబోయే కొత్త చిత్రం ఇటీవలే ప్రాంభమైంది. కేఎస్ రవికుమార్ బాలకృష్ణని రెండవసారి డైరెక్ట్ చేయబోతున్నాడు. సి కళ్యాణ్ నిర్మాత. ఈ ఏడాది బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీనితో తాన్ అభిమానులని సంతృప్తి పరిచేలా ఓ మాస్ యాక్షన్ ఫిలిం చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

సి కళ్యాణ్ బాలయ్య సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ పొలిటికల్ నేపథ్యం ఉన్న చిత్రంలో నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాటిదేమీ లేదని ఈ చిత్రం పక్కా వినోదాత్మక చిత్రం అని అన్నారు. బాలయ్య నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. 

ఈ చిత్రంలో బాలకృష్ణ మొదటగా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్ గా మారతాడు. బాలయ్య గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాడనేదే ఈ చిత్రంలో కీలకమైన అంశం. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.