మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలో వెండితెరపై అల్లూరి సీతా రామరాజుగా కనిపించబోతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలో వెండితెరపై అల్లూరి సీతా రామరాజుగా కనిపించబోతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నుంచి వరుసగా క్రేజీ చిత్రాలు రాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

ప్రస్తుతం రాంచరణ్ మరో దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 50 వ చిత్రం ఇది. ప్రస్తుతం RC15 షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. దర్శకుడు శంకర్ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

తాజాగా RC15 కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. షూటింగ్ మొదలై చాలా రోజులు గడుస్తున్నా ఈ మూవీలో విలన్ ఎవరనే విషయం తెలియదు. తాజా సమాచారం మేరకు ఈ మూవీలో విలన్ గా విలక్షణ నటుడు ఎస్ జె సూర్య నటించబోతున్నట్లు టాక్. విలన్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో ఎస్ జె సూర్య ఓకె చేశారట. 

తెలుగు ప్రేక్షకులకు ఎస్ జె సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. రాంచరణ్ బాబాయ్ పాన్ కళ్యాణ్ తో ఎస్ జె సూర్య.. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో కొమరం పులి వచ్చింది. ఇటీవల దర్శకత్వాన్ని పక్కన పెట్టిన సూర్య.. నటుడిగా రాణిస్తున్నాడు. రీసెంట్ గా శింబు 'మానాడు' చిత్రంలో సూర్య నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే తెలుగులో మహేష్ బాబు స్పైడర్ మూవీలో సూర్య సైకో విలన్ గా అద్భుతంగా నటించాడు. మరి రాంచరణ్, శంకర్ మూవీలో ఈ విలక్షణ నటుడు ఎలాంటి పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడో చూడాలి. 

ఈ మూవీలో రాంచరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. శంకర్ స్టైల్ లో సాగే ఈ చిత్రంలో ఎప్పటిలాగే సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ మిళితమై ఉండబోతున్నాయి.