కాపీ అంటూ అవమానించకండి!

First Published 7, May 2018, 6:29 PM IST
indraganti mohana krishna on sammohanam movie copy rumours
Highlights

ఒక హీరోయిన్ సాధారణ అమ్మాయిని ప్రేమించడం అనే కాన్సెప్ట్ 'నాటింగ్ హిల్' నుండి మొదలుకాలేదు

మొదటినుండి కూడా తన సినిమాలు సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకొని రూపొందిస్తుంటాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. 'జెంటిల్ మెన్','అమీ తుమీ' వంటి హిట్ సినిమాల తరువాత ఆయన తెరకెకిస్తోన్న మరో సినిమా 'సమ్మోహనం'. సుదీర్ బాబు, అతిథి రావు జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూసిన కొందరు ఈ సినిమా 'నాటింగ్ హిల్' అనే హాలీవుడ్ సినిమాకు కాపీ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన ఇంద్రగంటి ఇది కాపీ సినిమా కాదంటూ క్లారిటీ ఇచ్చాడు.

'ఒక హీరోయిన్ సాధారణ అమ్మాయిని ప్రేమించడం అనే కాన్సెప్ట్ 'నాటింగ్ హిల్' నుండి మొదలుకాలేదు. ఆ సినిమాతో పాటు నన్ను మరెన్నో ప్రభావితం చేసి ఉండొచ్చు. నిజంగా నేను ఇన్స్పైర్ అయితే టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వడానికి నేనేం వెనుకాడను. సినిమా విడుదలైన తరువాత అందరికీ తెలుస్తుంది ఇది ఎంత ఒరిజినల్ సినిమానా అని. నన్ను సంప్రదించకుండా ఏవేవో ఊహించుకొని ఇది కాపీ సినిమా అని ప్రచారం చేసి నన్ను అవమానిస్తున్నారు' అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. 
 

loader