Asianet News TeluguAsianet News Telugu

శ్రీదేవి ఇక లేరు... దుబాయ్ లో హాఠాన్మరణం

భారతదేశపు  ఫిమేల్ సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకున్న ఏకైక నటి...

Indias female super star Sridevi passes away

భారత దేశపు ఫిమెల్ సూపర్ స్టార్ శ్రీదేవి(54)దుబాయ్ లో గుండెపోటుతో మృతి చెందారు. శనివారం రాత్రిగుండెపోటు రావడంతో ఆమె కన్నుమూశారని ఆమె బావ సంజయ్‌కపూర్‌ ధ్రువీకరించారు. దుబాయ్ లో ఒక వివాహం కోసం భర్త బోనీ కపూర్ ,కూతురు కుషీ తో కలసి ఆమె దుబాయ్ వచ్చారు. చివరి క్షణాలలో భర్త, కూతురు ఆమె పక్కనే ఉన్నారు. శ్రీదేవికి భర్త బోనీకపూర్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1963 ఆగస్టు 13న శ్రీదేవి శివకాశిలో  జన్మించారు. నాలుగు సంవత్సరాల వయసులోనే ఆమె ఎంఎ తిరుముగం భక్తి రసం చిత్రం తునైవన్ తో లోనటించారు. అపుడు మొదలైన సినీ  ప్రస్తానం, అపుడుపుడు విరామం ఉన్నా చివరి దాకా కొనసాగుతూ వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలో నటించి అద్భుతమయిన నటన కౌశలం ప్రదర్శించి ఫిమెల్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న ఏకైక నటి శ్రీదేవి. చివర్లో బాలివుడ్ లో సెటిల్ అయినా తొలి బావుడ్ చిత్రం   1975లో వచ్చిన జూలీ.  1976లో మూండ్ర ముడిచి తో ఆమె నటిగా ఎదిగారు. తెలుగు తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటిగా నిల్చారు.  

Indias female super star Sridevi passes away

ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె రాఘవేంద్రరావు   దర్శకత్వం వహించారు.మొత్తంగా రాఘవేంద్రరావుతో ఆమె 24 చిత్రాలు తీశారు. 1977 లో బంగారక్క చిత్రంతో ఆమె తెలుగు చిత్ర సీమలో హీరోయిన్ అయ్యారు. తర్వాత అగ్ర శ్రేణి నటులందరితో ఆమె నటించిన చిత్రాలు అణిముత్యాలుగా మిగిలిపోయాయి.  ఎన్టీఆర్ తో ఆమె కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో నటించారు. ఎఎన్ ఆర్ తో  ఆమె ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలగు చిత్రాలలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి ఆమె కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. శోబన్ బాబుతో నటించిన దేవత మరొక సూపర్ హిట్ చిత్రం. కమల్ హాసన్ తరువాత  శ్రీదేవి కృష్ణతో  ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే, హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. తొలుత ఆమె ఎక్కువ చిత్రాలు జితేంద్రనటించారు. ఇవన్నీ తెలుగుచిత్రాల రీమేక్ లే. రాఘవేంద్రరావు  మరియు కె బాపయ్య  దర్శకత్వం వహించినవి.

Indias female super star Sridevi passes away

ఆమె నటించిన తెలుగు చిత్రాలు :

పదహారేళ్ల వయసు (1978),ఎర్రగులాబీలు (1978) (సిగప్పు రోజక్కల్ - అను చిత్ర అనువాదం),బుర్రిపాలెం బుల్లోడు (1979),కార్తీక దీపం (1979) వేటగాడు (1979),క్యలాణ రాముడు  (1979)ముద్దుల కొడుకు (1979),ఆటగాడు  (1980),చుట్టాలున్నారు జాగ్రత్త (1980),దేవుడిచ్చిన కొడుకు  (1980)ఘరానా దొంగ (1980),కక్ష (1980),మామా అల్లుళ్ల సవాల్  (1980) ప్రేమకానుక  (1980) రౌడిరాముడు కొంటె కృష్ణడు(1980) సర్దార్ పాపారాయుడు,  (1980), గజదొంగ (1980), సిఐడి (1980)మోసగాడు (1980)పాటగాడు  (1980),  ఆకలి రాజ్యం (1981) బాలనాగమ్మ (1981).

Indias female super star Sridevi passes away

భోగభాగ్యాలు (1981),ఘరానా దొంగలు  (1981),గడసరి అత్త-సొగసరి కోడలు (1981),కొండవీటి సింహం (1981)

ప్రేమాభిషేకం (1981) (హైదరాబాద్ లో 500 రోజులకి పైగా ఆడింది)రాణికాసుల రంగమ్మ (1981),ఇల్లాలు (1981), సత్యం శివం(1981),గురుశిష్యులు (1981),ఆదివిష్ణులు (1982),అనురాగ దేవత (1982),బంగారు భూమి (1982),బంగారు కానుక(1982),బంగారు కొడుకు (1982),  బొబ్బిలి పులి  (1982),దేవత (1982)

బాలివుడ్ కు సంబంధించి  సోల్వా సావన్ (1978) తోపున: ప్రవేశం జరిగింది. హిమ్మత్ వాలా (1983)తో ఆమె అడ్రసు బాలివుడ్ కు మారింది. తర్వాత మవాలి(1983), తోఫా(1984), నయా కదమ్ (1984)మక్సాద్ (1984),మస్తేరి(1985),నజ్రానా(1987),మిస్టర్ ఇండియా(1987), వక్త్ కి అవాజ్(1988) చాందినీ(1984) ఆమె చేసిన కొన్ని సూపర్ హిట్ చిత్రాలు. సద్మా (1983), నగీనా(1986), చాల్ బాజ్(1989), లమ్హే(1991),ఖుదా గవా(1992), గుమ్రా(1993)జుదాయ్91997) వంటి కమిర్షియల్ సూపర్ హిట్స్. అయితే,దాదాపు 15 సంవత్సరాలు విరామం తీసుకున్నారు. మళ్లీ 2013లో ఇంగ్లీష్ వింగ్లీష్ హిందీ చిత్రంతో  నటనా ప్రపంచంలోకి వచ్చారు.2013లో ఆమెకు పద్మశ్రీ అవార్డు లభించింది. సిఎన్ ఎన్ ఐబిఎన్ లోజరిగినఒక సర్వేవందేళ్ల సినిమా రంగంలో భారత దేశపు ఒకగొప్పనటిగా ఎంపికయ్యారు. 1996లో బోనీకపూర్‌తో శ్రీదేవికి వివాహమైంది. ఆమె కూతుర్లు.

Follow Us:
Download App:
  • android
  • ios