మెగాస్టార్‌ చిరంజీవికి పద్మ విభూషణ్‌ పురస్కారం వరించిన నేపథ్యంలో ప్రముఖ ఇండియన్‌ క్రికెటర్‌ కే ఎస్‌ భరత్‌ ఆయనపై తన ప్రేమని చాటి చెప్పారు. క్రేజీ గిఫ్ట్ ఇచ్చారు.

మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సెలబ్రిటీలంతా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంటికి విచ్చేసి ఆయన్ని సత్కరిస్తు్న్నారు. చిత్ర పరిశ్రమ ఇండస్ట్రీ ప్రముఖులే కాదు, వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం విశేషం. 

గత నాలుగు రోజులుగా చిరంజీవి ఇంటికి సెలబ్రిటీలు క్యూ కడుతున్నాయి. ఇలా అతిథులను రాకతో చిరు బిజీగా ఉంటున్నారు. అయితే సెలబ్రిటీలు చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని, ప్రేమని వివిధ రూపాల్లో చాటుకుంటున్నారు. సత్కరాలు, గిఫ్ట్ లు ఇస్తున్నారు. అయితే అందరిలో ప్రముఖ క్రికెటర్‌ కె ఎస్‌ భరత్‌ ప్రత్యేకంగా నిలిచారు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 

మెగాస్టార్‌పై భరత్‌ తన అభిమానాన్ని జెర్సీ రూపంలో చాటుకున్నారు. తన జెర్సీని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇండియన్‌ టెస్ట్ జెర్సీని చిరంజీవికి బహుమతిగా ఇవ్వడం విశేషం. తెలుగు రాష్ట్రానికి చెందిన కె ఎస్‌ భరత్‌ టీమిండియాలో క్రికెటర్‌ గా రాణిస్తున్నారు. వికెట్‌ కీపర్‌గా, బ్యాట్స్ మెన్‌గా ఆయన రాణిస్తున్నారు. అదే సమయంలో గతేడాది ఐపీఎల్‌ టీ 20లో కోల్‌కతా నైట్‌ రైడర్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతేడాది టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఆడారు. కేఎస్‌ భరత్‌ది విశాఖపట్నం కావడం విశేషం. 

Scroll to load tweet…

ఇక ప్రస్తుతం చిరంజీవి.. `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతుంది. `బింబిసార` ఫేమ్‌ వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. చిరంజీవి నటిస్తున్న ప్రాపర్‌ పాన్‌ ఇండియా మూవీ కావడం విశేషం. 

Read more: Saripodhaa Sanivaaram OTT: `సరిపోదా శనివారం` ఓటీటీ రైట్స్.. నాని కెరీర్‌లోనే హైయ్యెస్ట్..