Asianet News TeluguAsianet News Telugu

సినిమాలపై ఇండియన్‌ ఆర్మీ సంచలన వ్యాఖ్యలు

ఆర్మీలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా సినిమాలు తీస్తుంటారు. ఇప్పటి వరకు కొన్ని వందల్లో ఇలాంటి దేశ భక్తి చిత్రాలు వచ్చాయి. అయితే కొన్నింటిలో ఇండియ‌న్ ఆర్మీ గురించి త‌ప్పుగా చూపించ‌డంతో పాటు త‌క్కువ చేసి చూపిస్తున్నారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ ఆర్మీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

indian army sensational comments on movies
Author
Hyderabad, First Published Aug 2, 2020, 6:34 PM IST

భారతీయ సినిమాలపై ఇండియన్‌ ఆర్మీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపై సినిమాలు తీసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఎలా పడితే అలా తీస్తే ఊరుకునేది లేదని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ విశేషాలు చూస్తే.. 

ఇటీవల ఇండియన్‌ ఆర్మీ తరచూ పాపులర్‌ అవుతోంది. చైనా-భారత్‌ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇండియర్‌ ఆర్మీ గొప్పతనమేంటో మరింతగా తెలుస్తుంది. జూన్‌ 15న సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో ఇరవై మంది భారత జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యావత్‌ దేశం సైనికుల త్యాగాలను కొనియాడారు. 

ఇదిలా ఉంటే ఆర్మీలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా సినిమాలు తీస్తుంటారు. ఇప్పటి వరకు కొన్ని వందల్లో ఇలాంటి దేశ భక్తి చిత్రాలు వచ్చాయి. అయితే కొన్నింటిలో ఇండియ‌న్ ఆర్మీ గురించి త‌ప్పుగా చూపించ‌డంతో పాటు త‌క్కువ చేసి చూపిస్తున్నారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ ఆర్మీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇక‌పై ఎవ‌రైనా ఇండియ‌న్ ఆర్మీపై సినిమాలు తీయాల‌నుకుంటే, కేంద్ర ర‌క్ష‌ణ‌కు సంబంధించిన మంత్రిత్వ శాఖ నుండి నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికేట్‌(ఎన్‌ఓసీ)ని తీసుకోవాల్సి ఉంటుంది. ముందు స్క్రిప్ట్ చూపించి ఎన్‌.ఓ.సి తీసుకోవ‌డంతో పాటు సినిమా విడుద‌ల‌కు ముందు సినిమాగానీ, వెబ్‌ సిరీస్‌గానీ ఆర్మీ శాఖ‌కు సంబంధించిన సన్నివేశాల‌ను చూపించాల‌ని ఇండియ‌న్ ఆర్మీ పేర్కొంది. ఎన్ఓసీ లేని సినిమాల‌కు సెన్సార్ స‌ర్టిఫికేట్ ఇవ్వకూడ‌దంటూ కేంద్రం నిర్ణ‌యించింది. ఈ నిర్ణయంతో ఇకపై ఇండియన్‌ ఆర్మీపై సినిమాలు తీయాలంటే ఒళ్లు దగ్గరపెట్టుకుని తీయాల్సి ఉంటుంది. ఇది ఒకింత మంచి నిర్ణయమనే అని విశ్లేషకులు అంటున్నారు. 

ఇక ఇండియన్‌ ఆర్మీపై అనేక సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. `రోజా`, `విశ్వరూపం`, `గూఢచారి`, `హైదర్‌`, `నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా`, `రంగూన్‌`, `ఎల్‌ఓసీ`, `బార్డర్‌`, `పాల్టన్‌`, `టైగర్‌ జిందా హై`, `ఏక్‌ ది టైగర్‌`, `ట్యూబ్‌లైట్‌`, `బొబ్బిలి పులి`, `స్టాలిన్‌`, `సరిలేరు నీకెవ్వరు`, `ఉరిః ది సర్టికల్‌ స్ట్రైక్‌`, `ఫాంటమ్‌` వంటి పలు చిత్రాలు రాగా వీటిలో కొన్ని విజయం సాధించాయి, మరికొన్ని పరాజయం చెందాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios