బిగ్ బాస్ సీజన్ 6 సోమవారం 51వ ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. హౌస్ మేట్స్ మాటల యుద్ధం చేసుకుంటూ ఒకరి తప్పుల్ని మరొకరు ఎత్తిచూపుకున్నారు.

బిగ్ బాస్ సీజన్ 6 సోమవారం 51వ ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. హౌస్ మేట్స్ మాటల యుద్ధం చేసుకుంటూ ఒకరి తప్పుల్ని మరొకరు ఎత్తిచూపుకున్నారు. ఎప్పటిలాగే గీతూ, రేవంత్ మధ్య ఫుడ్ విషయంలో గొడవతో ఈ ఎపిసోడ్ మొదలైంది. 

ఇంతలో బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించారు. మొదట శ్రీసత్య సూర్యని నామినేట్ చేసింది. నామినేట్ చేసే వారు వారి ఫోటోలు మంటల్లో వేసి రీజన్స్ చెప్పాలి. ఇక ఆదిరెడ్డి.. మెరీనా, ఇనయని నామినేట్ చేశారు. ఇనయ హౌస్ లో ఎవరితో ఉపయోగం ఉంటె వారితోనే ఉంటుంది అని ఆదిరెడ్డి ఆరోపించారు. గీతూ మెరీనాని నామినేట్ చేసింది. 

కీర్తి.. శ్రీసత్యని నామినేట్ చేయగా వారి మధ్య హీట్ ఆర్గుమెంట్ సాగింది. అందరూ ఒకే రీజన్ తో తనపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీసత్య ఆగ్రహం వ్యక్తం చేసింది. నాకు కొంచెం దురద ఉంది. అయిపోయిన విషయాన్ని అందుకే పూసుకుంటున్నా అంటూ శ్రీసత్య చిరాకు వ్యక్తం చేసింది. 

ఇక సూర్య.. ఇనయాని నామినేట్ చేశాడు.. హౌస్ లో అందరికి సోప్ వేసి పబ్బం గడుపుకుంటున్నారు అంటూ ఇనయా సూర్యపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఇనయా.. శ్రీహాన్, సూర్య ఇద్దరినీ నామినేట్ చేసింది. అందుకు షాకింగ్ రీజన్స్ చెప్పింది. 

తాను శ్రీహాన్ బర్త్ డేని సెలెబ్రేట్ చేయడం వల్ల హౌస్ లో అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. శ్రీహాన్ తో నాకు ఎఫైర్ ఉందని అనుకుంటున్నారు అంటూ ఇనయా ఓపెన్ కామెంట్స్ చేసింది. నాకు శ్రీహాన్ తో ఎలాంటి రిలేషన్ లేదు. ఈ విషయంలో స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేందుకే శ్రీహాన్ ని నామినేట్ చేస్తున్నట్లు ఇనయా తెలిపింది. శ్రీహాన్ కి ఆల్రెడీ సిరితో రిలేషన్ ఉందని ఇనయా తెలిపింది. శ్రీహాన్ ఎవరో ఏదో అనుకుంటున్నారు అని నన్ను నామినేట్ చేయడం న్యాయమా ? ఈ విషయం అందరికి చెబితే సరిపోతుంది కదా అని శ్రీహాన్ వాపోయాడు. 

అలాగే సూర్యతో తన రిలేషన్ ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని.. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకే అతడిని నామినేట్ చేస్తున్నట్లు ఇనయా పేర్కొంది. ఫైమా, మెరీనా మధ్య ఆర్గుమెంట్ ఎక్కువగా జరిగింది. ఫైమా పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం లేదని మెరీనా ఆరోపించింది. 

మొత్తంగా హౌస్ లో ఉన్న అందరు సభ్యులు ఏ వారం నామినేట్ అయ్యారు. దీనితో నామినేషన్స్ నుంచి ఎవరు బయట పడతారో అనే ఉత్కంఠ ఉంది.