పొలిటిక్ గేమ్ మెగా బ్రదర్స్ ని రెండు వర్గాలుగా చీల్చేసిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. జనసేన పార్టీ ఆవిర్భావ (Janasena formationday)వేదిక సాక్షిగా పవన్ కళ్యాణ్, నాగబాబు అన్న చిరంజీవి పట్ల వ్యవహరించిన తీరు హెడ్ లైన్స్ లో నిలిచింది.

మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)అనే వటవృక్షం క్రింద ఎదిగిన పవన్, నాగబాబు ఆయన పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు. వేలమంది మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు విచ్చేసిన సభలో అయినవారికి కానివారికి కృతజ్ఞతలు తెలుపుకున్న ఇద్దరు అన్నదమ్ములు... చిరంజీవిని మచ్చుకైనా తలచుకోలేదు. ఇది జనసేన వర్గాలను కూడా అసహనానికి గురి చేసిన అంశం. పైగా పవన్ తాను రాజకీయాల్లోకి రావడానికి అన్నయ్య నాగబాబు ఇచ్చిన ఓ పుస్తకమే అని చెప్పడం కొసమెరుపు. జనసేన ఆవిర్భావ సభలో పవన్, నాగబాబు ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. 

చిరంజీవి అంతగా కానీ వాడైపోవడానికి  ఒకేఒక కారణం. వారి బద్దశత్రువు సీఎం జగన్(YS Jagan) తో చిరంజీవి సన్నిహితంగా మెలగడమే. పరిశ్రమతో సంబంధం లేకుండా జగన్ సీఎం అయిన వెంటనే చిరంజీవి సతీసమేతంగా కలిశారు. అప్పటి నుండి వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కొనసాగుతుంది. ఇక చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి టికెట్స్ ధరల విషయంలో విబేధాలు తలెత్తగా... సమస్య పరిష్కారంలో పరిశ్రమ ప్రతినిధిగా సీఎం జగన్ చిరంజీవిని గుర్తించారు. 

పవన్ కళ్యాణ్ టికెట్స్ ధరల విషయమై ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేల్చితే... చిరంజీవి మాత్రం సహనంతో సమస్య పరిష్కరించి పరిశ్రమ ప్రయోజనాలు కాపాడారు. అది మెగా బ్రదర్స్ కి నచ్చలేదు. టికెట్స్ ధరల సమస్యను రాజకీయం చేద్దామనుకున్న ప్రతిపక్షాలు, జనసేన ప్రణాళికలు గండి పడింది. చిరంజీవి పలుమార్లు సీఎం జగన్ ని ప్రశంసిస్తూ ట్వీట్స్ వేయడం కూడా పవన్, నాగబాబులకు నచ్చని విషయం. 

దీనికి ఓ బలమైన కారణం ఉంది. జనసేన కాపు సామాజిక వర్గం అనే పిల్లర్స్ పై నిలబడిన పార్టీ. ఆ పార్టీని అభిమానించే ఇతర సామాజిక వర్గాల కార్యకర్తలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. కాపు సామాజిక వర్గం మొత్తం తన వెనుక నడవం లేదనే బాధ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లో ఉంది.ఒకప్పుడు తమ సామాజిక వర్గానికి పెద్దన్నగా చిరంజీవి ఉన్నారు. చిరంజీవి పొలిటికల్ నిష్క్రమణతో చిరంజీవిని సీఎం గా చూడాలనుకున్న కాపు సామాజిక వర్గం పవన్ వైపు మరలారు. అయితే చిరంజీవిని అమితంగా అభిమానించే కాపులు భారీగానే ఉన్నారు. 

చిరంజీవి సీఎం జగన్ ని సన్నిహితంగా ఉండటం వలన ఎంతో కొంత నష్టం జనసేనకు జరుగుతుందని పవన్ భావిస్తున్నారు. సందర్భాన్ని బట్టి భావాలు మార్చేసే పవన్ నిన్న సభలో అందుకే చిరంజీవి పేరు ఎత్తలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం చిరంజీవి నీడలో ఎదిగిన పవన్, నాగబాబు (Nagababu)ఆయనను దూరం పెడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సీఎం జగన్ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తును ధృవీకరించారు. లేటైనా పర్లేదు సోలోగా వెళ్లి సీఎం సీటు కొట్టాలని ఆశపడుతున్న జనసేన వర్గాలకు ఇది షాకింగ్ న్యూస్. ఎందుకంటే పొత్తు అంటే దానర్ధం పవన్ సీఎం అభ్యర్థి కాదని.