Asianet News TeluguAsianet News Telugu

'ముత్తు'లో శింబు కనిపించడు.. గ్యాంగ్ స్టార్ ను చూస్తారు.. డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

తమిళ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' (The Life of Muthu). ఈరోజు మూవీ తమిళంలో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా సినిమాపై దర్శకుడు గౌతమ్ మీనన్, శింబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

In The Life of Muthu Movie Simbu will not be seen, Director Gautham Menon, Simbu interesting comments
Author
First Published Sep 15, 2022, 3:12 PM IST

తమిళ స్టార్ శింబు (Simbu) కథానాయకుడిగా,  స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన సినిమా 'వెందు తనిందదు కాడు'. ఇందులో సిద్దీ ఇధ్నానీ హీరోయిన్ గా నటించింది. ఈరోజు తమిళంలో ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగులో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల చిత్రం తెలుగు వెర్షన్ ను మరోరెండు రోజుల తర్వాత రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం  నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈరోజు తమిళంలో రిలీజ్ కావడంతో అక్కడ పాజిటివ్ టాక్ నే దక్కించుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీనన్, శింబు కొన్న ఇంట్రెస్టింగ్  కామెంట్స్ చేశారు. 

వారు మాట్లాడుతూ.. గౌతమ్, శింబు కాంబోలో ఇంతకు ముందు రొమాంటిక్ ఫిల్మ్స్ వచ్చాయి. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే.. ‘ముత్తు’ చాలా డిఫరెంట్ సినిమా అని చెప్పారు. ఇదొక గ్యాంగ్‌స్ట‌ర్‌ ఫిల్మ్. ముత్తు ఒక చిన్న పల్లెలో జీవించే వ్యక్తి. కొన్ని కారణాలతో ముంబైకి వెళతాడు. అక్కడివి వెళ్లడం ముత్తుకు ఇష్టం ఉందా? లేదా? అతడు చీకటి ప్రపంచంలోకి ఎలా వచ్చాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా కథగా చెబుతున్నారు. అలాగే.. లవ్, రొమాన్స్, యాక్షన్ కూడా చిత్రంలో ఉండటం విశేషం. ఆ ప్రపంచం నుంచి బయట పడటానికి అతడు ఏం చేశాడు? అనేది సినిమాలో చూడొచ్చు. 

శింబుతో గౌతమ్ మీనన్ ముందు లవ్ స్టోరీ చేయాలనుకున్నాడంటా. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశారంట. నెల రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా... లవ్ స్టోరీని పక్కన పెట్టేసి ఈ గ్యాంగ్‌స్ట‌ర్‌ సినిమాను ప్రారంభించాల్సి వచ్చిందని తెలిపారు. కథ బాగా నచ్చడంతో కేవలం 55 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసినట్టు సమాచారం. శింబు, రాధికా శరత్ కుమార్, మలయాళ నటుడు సిద్ధిఖీ కాకుండా మిగతా నటీనటులు అందరూ కొత్తవాళ్లైనప్పటికీ.. థియేటర్ ఆర్టిస్ట్స్ లను ఎంపిక చేయడంతో సినిమా సులువుగా పూర్తైయ్యింది. 
శింబు స్టార్ అయినప్పటికీ, ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉన్నప్పటికీ... 20 ఏళ్ళ కుర్రాడిగా కనిపించగలడు. ఈ చిత్రంతో శింబు గ్యాంగ్‌స్ట‌ర్‌గా మెప్పించాడు. స్క్రీన్ మీద కనిపించేది శింబు కాదని, ముత్తు అని ఆడియన్స్ ను నమ్మించడంలో శింబు విజయవంతం అయ్యారన్నారు. శింబుతో ఫస్ట్ టేక్‌లోనే సీన్ ఓకే అనిపించేలా చేస్తారు. అరుదుగా రెండో టేక్‌కు వెళతాం. అది కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. శింబు లాంటి యాక్టర్ ఉంటే సినిమా తీయడం ఈజీ అని గౌతమ్ ఖితాబిచ్చారు. ముఖ్యంగా గడ్డం పెంచడం కోసం, క్యారెక్టర్ పరంగా బాడీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ కోసం మూడు నాలుగు నెలలు వెయిట్ చేశామని,  శింబు బెస్ట్ పెర్ఫామెన్స్ ఈ సినిమాలో చూస్తారని చెప్పారు. సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మాత ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. 

అలాగే ‘రాఘవన్ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారని తెలిపారు. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని దర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పారు. తప్పకుండా 'రాఘవన్ 2' సినిమా ఉంటుందని కన్ఫమ్ చేశారు. కమల్ హాసన్ గారితో చేస్తాను. ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది  ఇప్పుడే చెప్పడం కాస్త తొందరపాటు అవుతుందని తెలిపారు. అదేవిధంగా అక్కినేని నాగ చైతన్య అడిగితే తప్పకుండా 'ఏ మాయ చేసావె 2'  చేస్తానని, 'ఘర్షణ 2' వెంకటేష్ చేతుల్లో ఉందన్నారు. డిసెంబర్‌లో విక్రమ్ ‘ధ్రువనక్షత్రం’ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios