బాలీవుడ్ లో హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్.. మలైకా అరోరా, అర్భాజ్ ఖాన్ జంటలు ఇటీవల విడాకులతో దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మరో జంట చేరబోతున్నట్లు బాలీవుడ్ లో వార్తలు గుప్పు మంటున్నాయి. 

ప్రముఖ నటుడు ఇమ్రాన్ ఖాన్, నటి అవంతిక మాలిక్ 2011లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. కానీ గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య రిలేషన్ సరిగా లేదట. వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ అవంతిక మాలిక్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 

కొన్ని సార్లు మన సన్నిహితులకు దూరంగా నడవాల్సి వస్తుంది. నా జీవితంలో ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అవంతిక కామెంట్స్ తన భర్త ఇమ్రాన్ ని ఉద్దేశించే అని అంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో త్వరలో విడాకులు తీసుకోబబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కు బంధువు. ఇమ్రాన్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇమ్రాన్ ఖాన్ చివరగా నటించిన చిత్రం కట్టి బట్టి.